మెదక్ జిల్లా : తుప్రాన్ మున్సిపల్ బిల్ కలెక్టర్ పై దాడికి నిరసనగా కార్మికులు విధులు బహిష్కరించి కార్యాలయం ముందు బైటాయించారు. దాడి చేసిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ కార్మికులతో మాట్లాడి నిరసన లో పాల్గొన్న సిబ్బందికి, కార్మికులకు అండగా ఉంటానంటు ఇక పై ఎవరైనా సిబ్బంది పై గాని కార్మికుల పై గాని దాడికి పాలుపడ్డ..దురుసుగా ప్రవర్తించిన కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య పనులు చేస్తూ పట్టణాన్ని శుభ్రపరిస్తూ సేవలు అందిస్తున్నారని వారిని అభినందించాల్సింది పోయి దాడులకు పలుపడటం హేయమైన చర్య అని వారి పై చట్ట పరమైన చర్యలకు పోలీస్ ఉన్నతాధికారులు పిర్యాదు చేశామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ హామీ తో మున్సిపల్ సిబ్బంది కార్మికులు విధులకు హాజరయ్యారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కౌన్సలర్లు పాల్గొన్నారు.
Published by:Venu Gopal
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.