కరోనా కేసుల్లో మహారాష్ట్ర కొత్త రికార్డులు...

మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబై మహానగరంలో 1751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: May 22, 2020, 8:11 PM IST
కరోనా కేసుల్లో మహారాష్ట్ర కొత్త రికార్డులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబై మహానగరంలో 1751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈరోజు కొత్తగా 2940 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మహారాష్టలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44582కి పెరిగింది. మరోవైపు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1517కి పెరిగింది. ముంబైలోని ధారావిలో ఈరోజు కొత్తగా 53 కరోనా కేసులు నమోదైనట్టు బృహన్ ముంబై కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో ధారావిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1478గా ఉంది. ధారావిలో కరోనా మరణాల సంఖ్య 57కు పెరిగింది. దేశంలో గత కొన్ని రోజులుగా కనీసం రోజుకు 5వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 1,20,000 దాటింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు (13,967), గుజరాత్ (12,905), ఢిల్లీ (11,659), రాజస్థాన్ (6,227) కరోనా కేసుల్లో అత్యధికంగా నమోదయ్యాయి.

First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading