ఇంటి నుంచి 2 కిలోమీటర్లు దాటి వెళ్లొద్దు... పోలీసుల హెచ్చరిక...

తమ ఇంటి నుంచి ప్రజలు ఎవరూ రెండు కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లొద్దని ముంబై పోలీసులు నగర ప్రజలకు సూచించారు.

news18-telugu
Updated: June 28, 2020, 5:30 PM IST
ఇంటి నుంచి 2 కిలోమీటర్లు దాటి వెళ్లొద్దు... పోలీసుల హెచ్చరిక...
ప్రతీకాత్మక చిత్రం (Reuters)
  • Share this:
తమ ఇంటి నుంచి ప్రజలు ఎవరూ రెండు కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లొద్దని ముంబై పోలీసులు నగర ప్రజలకు సూచించారు. మహారాష్ట్రలో, మరీ ముఖ్యంగా ముంబై మహానగరంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసేందుకు పోలీసులు ఈ కొత్త గైడ్ లైన్స్ జారీ చేశారు. అయితే ఓ రెండు మినహాయింపు మాత్రం ఇచ్చారు. ఆఫీసుకు వెళ్లే వారు అయితేనే రెండు కిలోమీటర్ల పరిధిని దాటి వెళ్లొద్దు. అలాగే, అత్యవసరం, మెడికల్ వంటి వాటికి మాత్రమే అనుమతి ఇస్తారు. షాపింగ్ కూడా అనుమతించరు. ముంబై ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతను పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సూచించనట్టు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరగడం మానుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాయామం కోసం బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దని పోలీసులు స్పష్టం చేశారు. సామాజిక దూరం పాటించని దుకాణాలను మూసేస్తామని హెచ్చరించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ ఉంటుంది. ప్రజలు బయటకు రావడానికి వీల్లేదు.
First published: June 28, 2020, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading