హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron : బిగ్ షాక్.. Pfizer వ్యాక్సిన్ 3డోసులు తీసుకున్నా ఓమిక్రాన్ కాటు -US రిటర్న్ Mumbai వ్యక్తికి

Omicron : బిగ్ షాక్.. Pfizer వ్యాక్సిన్ 3డోసులు తీసుకున్నా ఓమిక్రాన్ కాటు -US రిటర్న్ Mumbai వ్యక్తికి

కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు (లేదా బూస్టర్ డోసు)తో మాత్రమే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోగలమన్న నిపుణుల అంచనాలను తలకిందులయ్యాయి. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో అత్యంత శక్తిమంతమైనది పేరుపొందిన ఫైజర్ వ్యాక్సిన్.. అది కూడా మూడు డోసులు తీసుకున్న వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది..

ఇంకా చదవండి ...

కరోనా వైరస్ రెండో వేవ్ లో లక్షల మందిని బలితీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్లు ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే టీకా రెండు డోసులు సరిపోదని, మూడో డోసు (లేదా బూస్టర్ డోసు)తో మాత్రమే కొత్త మహమ్మారిని అడ్డుకోగలమన్న నిపుణుల అంచనాలను తలకిందులు చేస్తూ తాజా వార్తలు వెలువడ్డాయి. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో అత్యంత శక్తిమంతమైనది పేరుపొందిన ఫైజర్ వ్యాక్సిన్.. అది కూడా మూడు డోసులు తీసుకున్న వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. శనివారం ఉదయం నాటికి దేశంలోని 11 రాష్ట్రాల్లో 111 కేసులు నమోదయ్యాయి. వివారాలివి..

అమెరికా నుంచి ముంబైకి తిరిగొచ్చిన 29 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అతను అమెరికాలో ఉన్నప్పుడే ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులనూ తీసుకున్నాడు. అయినాకూడా ఒమిక్రాన్ బారినపడటం నిపుణులను ఆలోచనలో పడేసింది. మూడో (బూస్టర్)డోసు ద్వారా ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోగలమని ఇన్నాళ్లూ నిపుణులు భావిస్తుండగా, బూస్టర్ డోసు తర్వాత కూడా ఒమిక్రాన్ వ్యాప్తిస్తోందని నిర్దారణ కావడం గమనార్హం.

అతడి కోసం జైలుకు 12 మంది అందగత్తెలు.. పోలీసులకు నెలకు రూ.1కోటి లంచం.. ఈడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు

అమెరికా నుంచి నవంబర్ 9న ముంబై వచ్చిన వ్యక్తికి ఎయిర్ పోర్టులో టెస్టులు నిర్వహించగా, కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను ఐసోలేషన్ కు తరలించిన అధికారులు.. తన శాంపిళ్లను జీనోమ్ టెస్టింగ్ కు పంపారు. వాటికి సంబంధించిన రిపోర్టులు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నాక కూడా ఆ వ్యక్తి ఒమిక్రాన్ కాటుకు గురైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శుక్రవారం అధికార ప్రకటన చేసింది. ఎలాంటి లక్షణాలు లేకుండానే అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపింది.

Hyderabad : ప్రియుడితో వివాహిత రాసలీలలు చూసి మూడో వ్యక్తి బ్లాక్ మెయిల్.. ఆ తర్వాత షాకింగ్ ట్విస్టులు..భారత ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటి దాకా 15 ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఈ 15మందిలో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవు. వీళ్లలో 13 మంది ఇప్పటికే కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య 40కి చేరుకుంది. ఢిల్లీ(22) కేసులు, రాజస్థాన్ 17, కర్ణాటక 8, తెలంగాణ 8, గుజరాత్ 5, కేరళ 7, ఆంధ్రప్రదేశ్ 1, ఛండీగఢ్ 1, తమిళనాడు 1, వెస్ట్ బెంగాల్ లో 1 కేసుతో మొత్తంగా 11 రాష్ట్రాల్లో 111 ఒమిక్రాన్ కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విదించిన ప్రభుత్వాలు.. అసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు సూచిస్తోంది.

First published:

Tags: Mumbai, Omicron, Omicron corona variant, Pfizer Vaccine

ఉత్తమ కథలు