హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

వినాయకుడిపై కరోనా ఎఫెక్ట్.. అక్కడ ఉత్సవాలకు బ్రేక్

వినాయకుడిపై కరోనా ఎఫెక్ట్.. అక్కడ ఉత్సవాలకు బ్రేక్

లాల్ బాగ్ వినాయకుడు(ఫైల్ ఫోటో)

లాల్ బాగ్ వినాయకుడు(ఫైల్ ఫోటో)

భారత్‌లో అత్యంత ఘనంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలపై కరోనా ప్రభావం భారీగానే ఉంటుందనే వార్తలు వచ్చాయి.

కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేకపోవడంతో... దాని ప్రభావం సమీప భవిష్యత్తులో జరగాల్సిన ఇతర కార్యక్రమాలపై కూడా పడింది. భారత్‌లో అత్యంత ఘనంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలపై కరోనా ప్రభావం భారీగానే ఉంటుందనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ముంబైలోని అత్యంత ప్రాచుర్యం పొందిన లాల్ బాగ్ గణేశుడి ఉత్సవాలకు ఈ ఏడాది బ్రేక్ పడింది. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి లాల్ బాగ్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించవద్దని లాల్ బాగ్ గణేశ్ ఉత్సవ మండలి నిర్ణయించింది. అందుకు బదులుగా ఈ ప్రాంతంలోనే రక్తదాన, ప్లాస్మాదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ముంబైలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కరోనా విజృంభణ కారణంగా హైదరాబాద్‌లోని అత్యంత ఎత్తయిన ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఎత్తును కూడా భారీగా తగ్గించాలని నిర్వాహకులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

First published:

Tags: Ganesh Chaturthi 2020, Mumbai

ఉత్తమ కథలు