హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Black Fungus: భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్

Black Fungus: భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్

రెండో చికిత్స విధానం..
ఆరోగ్యవర్ధనీవతి రెండు మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలన్నారు. విషతుందుకవతి రెండు మాత్రలు రోజుకు మూడు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలని సూచించారు. హరిద్రఖండం 100 గ్రాముల్లో 10 గ్రాముల మల్లసింధూరం కలిపి తేనెతో 3 గ్రాముల చొప్పున రెండు సార్లు తీసుకోవాలన్నారు. టంకణభస్మం ఒక గ్రాము గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి.

రెండో చికిత్స విధానం.. ఆరోగ్యవర్ధనీవతి రెండు మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలన్నారు. విషతుందుకవతి రెండు మాత్రలు రోజుకు మూడు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలని సూచించారు. హరిద్రఖండం 100 గ్రాముల్లో 10 గ్రాముల మల్లసింధూరం కలిపి తేనెతో 3 గ్రాముల చొప్పున రెండు సార్లు తీసుకోవాలన్నారు. టంకణభస్మం ఒక గ్రాము గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి.

ఢిల్లీని కూడా బ్లాక్ ఫంగస్ కలవరపెడుతోంది. రోజు రోజుకూ అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఇప్పటి వరకు 200పైగా కేసులు నమోదయినట్లు తెలుస్తోంది

కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌ను ఇప్పుడు బ్లాక్ ఫంగస్ (మ్యుకర్‌మైకోసిస్) వెంటాడుతోంది. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. చాలా రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో మరణాలు రేటు ఎక్కువగా ఉండడంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తమవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధి (ఎపిడెమిక్)గా ప్రకటించింది. రాజస్థాన్ ఎపిడెమిక్ యాక్ట్ 2020 కింద బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా నోటిఫై చేసింది. ఈ మేరకు రాజస్థాన్  ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ అఖిల్ అరోరా నోటిఫికేషన్ జారీచేశారు.

రాజస్థాన్‌లో ప్రస్తుతం 100 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించారు. వీరి కోసం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకొని, డయాబెటిస్ ఉన్న వారే ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్‌ చికిత్సపై ప్రత్యేక చర్యలు చేపట్టింది రాజస్థాన్ ప్రభుత్వం.

అటు దేశరాజధాని ఢిల్లీని కూడా బ్లాక్ ఫంగస్ కలవరపెడుతోంది. రోజు రోజుకూ అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఇప్పటి వరకు 200పైగా కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. గంగారామ్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 40 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చేరారు. మరో 16 మంది బెడ్స్ కోసం వేచిచూస్తున్నారు. బ్లాక్ ఫంగస్‌పై కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే Amphotericin-B ఇంజెక్షన్‌ను బ్లాక్ మార్కెట్‌లోకి పక్కదారి పట్టకుండా టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. బ్లాక్ ఫంగస్ బాధితులకు సకాలంలో ఇంజెక్షన్‌లు అందేలా ఆ కమిటీ చర్యలు తీసుకుంటోంది.

ఇది కూడా చదవండి:

Black Fungus: కరోనా బాధితుల్లో బ్లాక్​ ఫంగస్​ ఇన్ఫెక్షన్​.. దీని లక్షణాలేంటి? ట్రీట్​మెంట్​ ఉందా?

First published:

Tags: Black Fungus, Black fungus death, Coronavirus, Rajasthan

ఉత్తమ కథలు