ఖాట్మండు నుంచి కనిపించిన ఎవరెస్ట్ శిఖరం.. కొన్ని దశాబ్దాల తర్వాత..

ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ (29,029 ఫీట్లు) తమకు స్పష్టంగా కనిపించిందని అక్కడి ప్రజలు తెలిపారు. ఆ దృశ్యాలను అభూషన్ గౌతమ్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాల్లో బంధించారు.

news18-telugu
Updated: May 21, 2020, 2:54 PM IST
ఖాట్మండు నుంచి కనిపించిన ఎవరెస్ట్ శిఖరం.. కొన్ని దశాబ్దాల తర్వాత..
ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ (29,029 ఫీట్లు) తమకు స్పష్టంగా కనిపించిందని అక్కడి ప్రజలు తెలిపారు. ఆ దృశ్యాలను అభూషన్ గౌతమ్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాల్లో బంధించారు.
  • Share this:
కరోనా లాక్‌డౌన్ తర్వాత ప్రకృతిలో ఎంతో మార్పు వచ్చింది. దాదాపు 2 నెలల పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడం, ప్రజా రవాణా నిలిచిపోవడం, పరిశ్రమలు మూతపడడంతో.. వాతావరణ కాలుష్యం గణనీయస్థాయిలో తగ్గింది. నదులు, సరస్సులు పరిశుభ్రంగా మారాయి. గాలిలో కాలుష్యస్థాయి తగ్గడంతో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలు కూడా కనిపించాయి. ఈ క్రమంలో నేపాల్ రాజధాని ఖాట్మండు ప్రజలకు కూడా హిమాలయాల్లో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కనిపించింది. మే 10న ఖాట్మండు నుంచి స్పష్టంగా కనిపించింది. కరోనా లాక్‌డైన్ పుణ్యామా అని.. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ కనువిందు చేసింది.

ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ (29,029 ఫీట్లు) తమకు స్పష్టంగా కనిపించిందని అక్కడి ప్రజలు తెలిపారు. ఆ దృశ్యాలను అభూషన్ గౌతమ్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాల్లో బంధించారు. ఆ ఫొటోలను నేపాల్ టైమ్స్ ట్విటర్‌లో షేర్ చేసింది. మౌంటర్ ఎవరెస్ట్‌కు 200 కి.మీ.దూరంలో ఉన్న చోబర్ ప్రాంతం నుంచి గౌతమ్ ఎవరెస్ట్ శిఖరం ఫొటోలను తీశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

First published: May 21, 2020, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading