Home /News /coronavirus-latest-news /

MOST DANGEROUS SITUATION IN ANDHRA PRADESH DAILY INCREASING DENGUE CASES MORE THAN CORONA VIRUS NGS GNT

Viral Tension: ఏపీలో కరోనాను మించి భయపెడుతున్న మరో మహమ్మారి.. పెరుగుతున్న కేసులు

కరోనా కంటే భయపెడుతున్న మరో మహమ్మారి

కరోనా కంటే భయపెడుతున్న మరో మహమ్మారి

Pandemic Situation: అసలే వర్షాకాలం.. వైరల్ ఫీవర్లు బయపెట్టే సీజన్.. ఇదే సమయంలో కరోనా ఇంకా వెంటాడుతుండడం ఆందోళన పెంచుతోంది. అయితే దానిని మించి మరో మహమ్మారి ఇప్పుడు విజృంభించడం కలవర పెడుతోంది.

  అన్నారఘు, న్యూస్ 18 అమరావతి ప్రతినిధి..

  Dangerous Dengue: ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకోడైల్ ఫెస్టివల్ అన్నట్టు ఉంది ఏపీ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  ను ఇంకా కరోనా వీడడం లేదు. మూడు నాలుగు జిల్లాల్లో పరిస్థితి ఆందొళన కరణంగానే ఉంది. దానికి తోడు స్కూల్స్ రీ ఓపెన్  (Schools Reopen)అవ్వడంతో కొంతమంది విద్యార్థులు కూడా కరోనా (Corona virus) బారిన పడుతున్నారు. సెకెండ్ వేవ్ పూర్తిగా ముగియకముందే థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. అసలే ఇది వర్షాకాలం.. వైరల్ ఫీవర్లకు అడ్డగా చెప్పుకునే సీజన్ దీంతో  కరోనాను మించి డెంగ్యూ మహమ్మారి కోరలు చాచుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో జనం ఆస్పత్రుల బాట పట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ప్రస్తుతం ఏపీలో డెంగ్యూ డేంజర్ బెల్స్ (Dengue danger bells) మోగిస్తుంది. రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి.  డెంగ్యూ బాధితులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కురుస్తున్న వర్షాలతో పారిశుధ్య నిర్వహణ లేకపోవటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. అసలే కరోనా కల్లోలంతో వణికిపోతున్న జనానికి డెంగ్యూ కునుకులేకుండా చేస్తోంది.

  ఓ వైపు కరోనా మరోవైపు డెంగ్యూ తో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. తాజా పరిస్థితులు చూస్తుంటే డెంగ్యూ జ్వరాల కేసులు రోజు రోజు కు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. గత పది రోజులుగా రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్లేట్ లెట్స్‌ పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

  కర్నూలు జిల్లాకు చెందిన 8 సంవత్సరాల పాపా మృతిచెందటం తో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.  డెంగ్యూ, చికన్ గున్యాతో పాటు విష జ్వరాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో అధికారులు ప్రత్యేకదృష్టి సారించారు. లక్షణాలు ఉంటే మాత్రం ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. వర్షాలు పడుతున్న వేళ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖాధికారులు. ఎవరికైనా డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.

  ఇదీ చదవండి: బాబోయ్ బడిలో కరోనా..? నిబంధనలను గాలికి వదిలేస్తున్నారా..?

  వైరల్ జ్వరాల్లో కొంచెం ప్రమాదకరమైనవంటే డెంగీ, చికన్ గున్యా, స్వైన్ ఫ్లూ లాంటివే. అయితే ప్రతి దానికి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. జ్వరం చాలా తీవ్రంగా ఉంటుంది. జ్వరం వచ్చిన రోజు నుంచీ లక్షణాల తీవ్రత ఒకే రకంగా ఉంటుంది. డెంగీ ఉన్నప్పుడు అయిదు రోజుల వరకు జ్వరం 101 నుంచి 105 డిగ్రీల వరకు ఉంటుంది. ఎముకలు విరిగినట్టు నొప్పులుంటాయి. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. డెంగీ ఉన్నప్పుడు శరీరంపై దద్దుర్లు కూడా రావొచ్చు. దీన్నినిర్ధారించడానికి డెంగీ రాపిడ్ డిటెక్షన్ టెస్టు, యాంటి జెన్ టెస్టు అనే ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు.

  ఇదీ చదవండి: గ్రామ ప్రజలకు బంపర్ ఆఫర్.. మహిళా సర్పంచ్ నిర్ణయంపై ప్రశంసలు

  వర్షాకాలం అంటే చాలామందికి ఇష్టం. అందమైన వాతావరణం, బయట వర్షం పడుతుంటే వేడి వేడి స్నాక్స్ తింటూ కాలం గడపడం అందరికీ ఇష్టమైన పనులే.. అయితే వర్షా కాలం కేవలం వీటినే కాదు.. ఎన్నో రకాల రోగాలను కూడా తీసుకొస్తుంది. డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి ఎన్నో వ్యాధులు వర్షా కాలంలోనే ఎక్కువగా ప్రబలుతుంటాయి. వీటితో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Corona virus, Dengue fever

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు