లాక్ డౌన్‌ పొడిగింపుపై స్పందించిన కిషన్ రెడ్డి...

లాక్ డౌన్‌ పొడిగింపుపై స్పందించిన కిషన్ రెడ్డి...

కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)

లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

 • Share this:
  లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్‌ను పొడిగించాలని పలు రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని చెప్పారు. ప్రజలు లాక్ డౌన్‌కు సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. ‘చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.’ అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనవసరపు కారణాలతో ప్రజలు బయటకు వస్తున్నారని చెప్పారు. తాజా కూరగాయలే అవసరం లేదని, పప్పుతో తినొచ్చని, వారం రోజులకు సరిపడా సరకులు దగ్గర పెట్టుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్ డౌన్ అమలు పరుస్తోందని చెప్పారు.  దేశంలో టెస్టింగ్ కిట్ల కొరత లేదని, ఈరోజు రెండు లక్షల కిట్లు వచ్చాయన్నారు. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చెయ్యలేదన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు
  ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు