Andhra Pradesh: ఉదయం ఎమ్మెల్యే.. సాయంత్రం మంత్రి.. అవాక్కయ్యేలా చేస్తున్న వైసీపీ నేతలు

Andhra Pradesh: ఉదయం ఎమ్మెల్యే.. సాయంత్రం మంత్రి.. అవాక్కయ్యేలా చేస్తున్న వైసీపీ నేతలు

ఉదయం ఎమ్మెల్యే, మధ్యాహ్నం మంత్రి ఒకే చెక్ అందజేత

నేతలు అన్న తరువాత పబ్లిసిటీ అన్నది కామన్.. ఇక అధికార పార్టీ నేతలు అంటే పబ్లిసిటీ కోసం ఆరాటపడడం తప్పని సరి.. అయితే ఒకే చెక్ ను.. ఒకే బాధితులకు రెండు సార్లు.. అదే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 • Share this:
  ఏపీలో సంక్షేమ పథకాలు.. పరిహరాలు బాగానే చెల్లిస్తున్నారు. లబ్ధిదారులు వీటిపై ఆనందగానే ఉన్నారు. అయితే కొందరు నేతలు మాత్రం పబ్లిసిటీ పిచ్చిలో ఓవర్ బిల్డప్ ఇవ్వడం విమర్శల పాలవుతోంది. సాధారణంగా లబ్ధి దారులకు నగదు కాని.. చెక్ కాని అధికారులే అందిస్తుంటారు.. స్పాట్ లో పరిహారం ఇచ్చే సమయంలోనే మంత్రులు, లేదా స్థానిక నేతలు వెళ్లి న్యాయం చేస్తారు. కానీ కొందరు నేతలు పరిహారం పేరుతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ నవ్వుల పాలవుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉదయం ఎమ్మెల్యే.. సాయంత్రం మంత్రి. ఒకే చెక్కును బాధిత కుటుంబానికి అందచేశారు. ఆ చెక్ ను అందుకున్నది కూడా అదే పిల్లలు.. బాధితులు ఒకరే కాని.. ఇద్దరు నేతలు వారికే వేర్వేరు సమయాల్లో చెక్ లు అందించారు. దీనిపై విపక్షలు తీవ్ర విమర్శలు చేస్తుంటే.. నెటిజన్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు.. ఆర్థిక సాయం చేసి కూడా అధికార పార్టీ నేతలు అబాసుపాలవ్వడం చర్చనీయాంశంగా మారింది..

  ఉదయం ఎమ్మెల్యే, సాయంత్రం మంత్రి ఒకే చెక్కును అందిస్తూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఇది చూస్తున్న అధికారులు.. బాధితుల కుటంబీకులు ఏం చేయాలో పాలుపోక బిక్కమొహం వేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కరోనా కారణంగా తల్లి దండ్రుల్ని కోల్పోయిన పిల్లలకి ప్రభుత్వం చెక్కులు అందజేసింది. ఈ సందర్భంగానే ఈ ఫోజుల కార్యక్రమం నడిచింది.

  ఇదీ చదవండి: ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూలో సండలింపులు.. కొత్త గైడ్ లైన్స్ ఇవే..

  కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకి పదిలక్షల రూపాయలు నగదు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కంధ్రకోట నవీన్, కంధ్రకోట సౌజన్య దంపతులు కోవిడ్ కారణంగా మరణించారు. వారి పిల్లలు శ్రీమిదున్, శ్రీచంద్రాలకి చెరో 10 లక్షలు చొప్పున 20 లక్షల రూపాయలు చెక్కుని ఎమ్మెల్యే అమర్నాధ్ అందించారు. మంగళవారం ఉదయం విశాఖ నగరంలోని దొండపర్తిలో పిల్లల ప్రస్తుత గార్డియన్ల ఇంటికి వెళ్లి.. స్వయంగా అందజేశారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కావడంతో ఆయన చెక్కు ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. ఫోటో కూడా దిగి సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. ఇక్కడి వరకూ ఓకే.

  ఇదీ చదవండి:: ఉక్కపోత భరించలేక గాలికోసం చూస్తే.. ఇళ్లు గుల్ల అయ్యింది..? అసలేం జరిగింది..?

  అయితే ఉదయం ఎమ్మెల్యే అందజేసిన అదే చెక్కును సాయంత్రం పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇదే ఇద్దరు పిల్లలకు అందించారు. కానీ.. ప్లేస్ టైం మారిపోయిందంతే. ఆ పిల్లలను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకుని అక్కడ మీడియాను పిలిచి కార్యక్రమం నడిపారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, మేయర్ జి.వి. హరికుమారి, అరకు ఎం.పి జి.మాధవి సమక్షంలో అందించారు. ఇందులోనే మళ్లీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఉండటం గమనార్హం. పిల్లలకు ఇవ్వాల్సిన చెక్కులను ఉదయం ఎమ్మెల్యే సాయంత్రం మంత్రి అందించడం వైజాగ్ ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. వీరి ఫోటో ఫోజులు తగలెయ్య అనుకుంటూ లోలోపలే నవ్వుకుంటున్నారు. విపక్షాలు సైతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  అగ్ర కథనాలు