హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Telangana: బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా.. మొత్తం 18 మంది.. రెండు రోజులు ఆగాల్సిందే..

Telangana: బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా.. మొత్తం 18 మంది.. రెండు రోజులు ఆగాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: పాజిటివ్ వచ్చిన వారందరికి సంబందించిన శాంపిల్స్ ఏ వైరస్ తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్స్ కోసం సీసీఎంబికి పంపించారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి.

  కొత్త రకం కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో.. మూడు వారాల క్రితం బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించి టెస్టులు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1216 మంది బ్రిటన్ నుండి తెలంగాణకు వచ్చారు. వీరిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఫలితాలు వచ్చిన వారిలో ఈ రోజు మరో ఇద్దరికీ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిద్దరూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకి చెందిన వారేనని వెల్లడించింది. మొత్తం ఇప్పటివరకు 18 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

  పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఆరుగురు, జగిత్యాల జిల్లా కు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజిటివ్ గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. 18 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 18 మందికి 79 మందికి అతిసన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి.. వారిని క్వారేంటిన్ లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారందరికి సంబందించిన శాంపిల్స్ ఏ వైరస్ తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్స్ కోసం సీసీఎంబికి పంపించారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి.

  బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మరో 184 మందికి సంబందించిన వివరాలు సమగ్రంగా లేవు. వారి అడ్రస్‌లు, ఫోన్ నంబర్స్ సరిగా లేవు. వారందరినీ ట్రేస్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా బ్రిటన్ నుండి వచ్చిన వారు లేదా బ్రిటన్ మీదుగా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్ కి వాట్స్ ఆప్ ద్వారా అందిచాలని వైద్య, ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వారి ఇంటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేస్తారని తెలిపింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Telangana, UK Virus

  ఉత్తమ కథలు