ఏపీలోని ఆ గ్రామంలో కరోనా కలవరం.. అంతా ఆ ఒక్కడి వల్లే..

ఆర్ఎంపీ డాక్టర్ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించిన అధికారులు... కరోనా సోకిన ఇతరుల కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు.

news18-telugu
Updated: August 7, 2020, 6:59 PM IST
ఏపీలోని ఆ గ్రామంలో కరోనా కలవరం.. అంతా ఆ ఒక్కడి వల్లే..
ఊరిలో కరోనా పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
  • Share this:
కరోనా మహమ్మారి నగరాల నుంచి పట్టణాలకు గ్రామాలకు కూడా విస్తరిస్తోంది. దీంతో గ్రామాల్లోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఏపీలోని ఆ గ్రామాన్ని ఇప్పుడు కరోనా వైరస్ వణికిస్తోంది. గ్రామంలో ఎంతమందికి కరోనా సోకిందో అని ఆ గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఈ భయానికి కారణంగా ఒకే ఒక్కడని తేలింది. గ్రామ ప్రజలను రోగాల బారి నుంచి కాపాడాల్సిన ఆర్‌ఎంపీ వైద్యుడి కారణంగానే గ్రామంలో వైరస్ విస్తరించింది. అతడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో... అతడి దగ్గర చికిత్స తీసుకున్న పలువురు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తం 16 మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో గ్రామంలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆర్ఎంపీ డాక్టర్ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించిన అధికారులు... కరోనా సోకిన ఇతరుల కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు. తన నిర్లక్ష్యం కారణంగా గ్రామస్థులకు కరోనా సోకడానికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ తీరు పట్ల గ్రామంలోని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు కరోనా లక్షణాలు ఉన్న వారంతా కచ్చితంగా పరీక్షలు చేయించుకుని తాము ఇచ్చే సూచనలు పాటించాలని వైద్యాధికారులు సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: August 7, 2020, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading