Home /News /coronavirus-latest-news /

MORE THAN 1000 CORONA PATIENTS MISSING IN CHITTOOR DISTRICT ESPECIALLY TIRUPATI OF ANDHRA PRADESH AK

Corona Patients Missing: తిరుపతిలో అధికారులకు కొత్త టెన్షన్.. ఆ 1000 మంది ఎక్కడ ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పరీక్షల సమయంలో సదురు వ్యక్తులు ఇచ్చిన ఇంటి నెంబర్లలో రోగుల జాడ తెలియడం లేదు. వారి ఫోన్లు కూడా పనిచేయకపోవడం అధికారులను కలవరపెడుతోంది.

    ఏపీలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. అందులోనూ చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో జిల్లాలోని తిరుపతి సహా అనేక పట్టణాల్లో లాక్‌డౌన్ తరహా కఠిన నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. జిల్లాలో కరోనాను కట్టడి చేయాలని కృషి చేస్తున్న అధికారులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. జిల్లాలో పాజిటివ్ పేషెంట్ల మిస్సింగ్ కలకలం రేపుతోంది. వెయ్యి మంది కరోనా రోగుల ఆచూకీ లభించడం లేదు. గత రెండు నెలల కాలంలో జిల్లాలో 9,164 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 7,270 మందిని మాత్రమే అధికారులు గుర్తించారు. 1049 మంది రోగుల ఆచూకీ గల్లంతు అయ్యింది. సంబంధిత ఇంటి నెంబర్లలో రోగుల జాడ తెలియడం లేదు. వారి ఫోన్లు కూడా పనిచేయకపోవడం అధికారులను కలవరపెడుతోంది.

    పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కోసం అధికారుల ట్రేసింగ్ చేస్తున్నారు. మరో 845 మంది పాజిటివ్ రోగులు తిరుపతి వదిలి బయటికి వెళ్లినట్లు అధికారలు గుర్తించారు. బాధితులు శాంపిల్స్ తీసుకునే సమయంలో ఫోన్ నంబర్లు, తాము నివాసం ఉంటున్న చిరునామాలు తప్పుగా ఇస్తున్నారు. కరోనా ఫలితాలు రాకముందే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది.ఈ తరహా వ్యక్తులు వైరస్‌ను ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేస్తున్నారని అధికారులు అంటున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Covid-19, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు