తెలంగాణ పోలీసులను కరోనా భయపెడుతోంది. కరోనా కాలంలోనూ విధులు నిర్వహించిన పోలీసులు.. ఈ వైరస్ బారిన పడే వారిలో ముందువరుసలో ఉంటున్నారు. ఇప్పటికే తెలంగాణ పోలీసు శాఖలో మొత్తం 5684 మందికి కరోనా సోకింది. వీరిలో 2284 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 3357 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక కరోనా కారణంగా పోలీసు శాఖలో ఇప్పటివరకు 44 మంది చనిపోయారు. తెలంగాణలో పోలీసుశాఖలో దాదాపు 54 వేల మంది సిబ్బంది ఉన్నారు. దీంతో పది శాతానికి పైగా సిబ్బంది కరోనా బారిన పడ్డినట్టు తెలుస్తోంది.
ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1967 మందికి కరోనా సోకింది. వారిలో 891 మందికి చికిత్స అందిస్తున్నారు. 1053 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 23 మంది కరోనా కారణంగా చనిపోయారు. వరంగల్లో 526 కరోనా కేసులు నమోదయ్యాయి. 361 మందికి చికిత్స పొందుతున్నారు. 163 మంది పోలీసులు కరోనాను జయించారు. ఇద్దరు పోలీసులు వైరస్ కారణంగా చనిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Telangana, Telangana Police