Krishna District: కృష్ణా జిల్లాలో కొత్తగా ప్రకటించిన 6 కంటైన్మెంట్ జోన్లు ఇవే..

Krishna District: కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 513 కంటైన్మెంట్ జోన్లలో 2777 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. అందువల్ల కరోనా వ్యాప్తి చెందుకుండా ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.

news18-telugu
Updated: October 9, 2020, 5:41 PM IST
Krishna District: కృష్ణా జిల్లాలో కొత్తగా ప్రకటించిన 6 కంటైన్మెంట్ జోన్లు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కేసులు ఎక్కువ నమోదయ్యే ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి.. అక్కడ కోవిడ్ 19 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్‌లాక్ నిబంధనలన్నీ నాన్ కంటైన్మెంట్ జోన్లలోనే అమలు చేయాలని కేంద్రం కూడా రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని తెలిపింది. ఈ క్రమంలోనే కంటైన్మెంట్ జోన్ల విషయంలో స్థానికంగా నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఆరు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందుకే వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వీటిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించామని వెల్లడించారు.

కలెక్టర్ ప్రకటించిన కంటైన్మెంట్ జోన్లలో నాగాయలంక మండలంలోని వక్కపట్లవారిపాలెం గ్రామం, కలిదిండి మండలంలో గోపాలపురం గ్రామం, బంటుమిల్లి మండలంలో చొరంపూడి గ్రామం, నాగాయలంక మండలంలో కొమరవోలు గ్రామం, పమిడిముక్కల మండలంలో హనుమంతపురం గ్రామం, నందిగామ మండలంలో జొన్నలగడ్డ గ్రామం ఉన్నాయి. ఈ ప్రాంతాలలో కంటైన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని.. ప్రజలు ఎవరు బయటకు రాకూడదని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 513 కంటైన్మెంట్ జోన్లలో 2777 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. అందువల్ల కరోనా వ్యాప్తి చెందుకుండా ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.

ఇక గత 28 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాని పలు గ్రామాలను కంటైన్మెంట్ జోన్ల పరిధి నుంచి తొలగిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. జగ్గయ్యపేట మండలంలో గౌరవరం గ్రామం, ముదినేపల్లి మండలంలో అల్లూరు గ్రామం, నూజివీడు మండలంలో మీర్జాపురం గ్రామం, వత్సవాయి మండలంలో లింగాల గ్రామం, కలిదిండి మండలంలో వెంకటాపురం గ్రామం, పెడన మండలంలో కొంకెపూడి గ్రామం, మొవ్వ మండలంలో రాచర్లపాలెం గ్రామాలను కంటైన్మెంట్ జోన్ల పరిధి నుంచి తొలగించారు.

కృష్ణా జిల్లాలో కొత్తగా 399 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం 30710 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో 2747 యాక్టివ్ కేసులు ఉండగా, 27479 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జిల్లావ్యాప్తంగా కరోనా కారణంగా 484 మంది చనిపోయారు.
Published by: Kishore Akkaladevi
First published: October 9, 2020, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading