తెలంగాణలో ఆగని కరోనా జోరు... అదొక్కటే ఊరట

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

news18-telugu
Updated: May 23, 2020, 9:55 PM IST
తెలంగాణలో ఆగని కరోనా జోరు... అదొక్కటే ఊరట
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. శనివారం కొత్తగా 52 కరోనా కేసులు వెలుగుచూసినట్టు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1813కు చేరింది. నేడు కరోనా నుంచి 25 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1068కి చేరింది. నేడు కరోనా కారణంగా ఒకరు చనిపోయారు. దీంతో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 49గా నమోదైంది. ఇక ఈ రోజు కొత్తగా వెలుగులోకి వచ్చిన 52 కేసుల్లో 33 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా, మరో 19 మంది వలస కూలీలకు కరోనా సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 696గా ఉంది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గడిచిన రెండో రోజులతో పోల్చితే కరోనా కారణంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పెరగడంతో పాటు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య తక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం.

వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి,నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల, నిర్మల్ ఉన్నాయి.

Coronavirus cases today,cm kcr review meeting,telangana deaths, corona cases in telangana, corona virus, covid-19, telugu news, telangana updates,కరోనా కేసుల వివరాలు కేసీఆర్ సమీక్షా సమావేశం, తెలంగాణలో కరోనా మరణాలు
వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన




First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading