హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

UK Virus: భారత్‌లో మరిన్ని కొత్త రకం కరోనా కేసులు.. ఎన్నంటే..

UK Virus: భారత్‌లో మరిన్ని కొత్త రకం కరోనా కేసులు.. ఎన్నంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UK Virus: దేశంలో కొత్తగా మరో నాలుగు కొత్త రకం కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  బ్రిటన్‌ నుంచి భారత్‌కు విస్తరించిన కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో కొత్తగా మరో నాలుగు కొత్త రకం కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో మూడు కేసులు పుణె వైరాలజీ ల్యాబ్‌లో ధృవీకరించగా.. ఒకటి ఢిలీలోని ఐజీఐబీలో గుర్తించారు. దీంతో దేశంలో కొత్త రకంగా కరోనా కేసుల సంఖ్య 25కు చేరింది. వీరంతా ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలోనే ఐసొలేషన్‌లో ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ వెలుగులోకి రావడంతో.. బ్రిటన్ నుంచి కొద్దిరోజులుగా ఇండియా వచ్చిన వారి వివరాలను సేకరించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

  వారిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించి.. వారిలో కొత్త రకం వైరస్ నమూనాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు పుణె సహా ఇతర వైరాలజీ ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో 25 మందికి ఈ కొత్త రకం వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. మరోవైపు కొత్త రకంగా వైరస్ మరింతగా విస్తరించకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ వైరస్ సోకిన వారి కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టి.. వారి సన్నిహితులు, దగ్గరగా మెలిగిన వారికి కూడా టెస్టులు చేస్తున్నాయి.

  కాగా దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం ఇండియాలో కొత్తగా 21,821 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,02,66,674కి చేరింది. ఇందులో 98,60,280 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,57,656 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 299 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,48,738కి చేరింది. గడిచిన 24 గంటల్లో 26,139 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఉష్ణోగ్రతలు పడిపోవడం, సెకండ్ వేవ్ ఎఫెక్ట్, కొత్త స్ట్రెయిన్ కారణంగా కేసులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Coronavirus, UK Virus

  ఉత్తమ కథలు