Home /News /coronavirus-latest-news /

MORE 10 CORONA CASES IN TELANGANA SAYS MINISTER ETELA RAJENDAR AK

తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా... ఇవాళ 10 మందికి పాజిటివ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో నేడు కొత్తగా 10 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

    తెలంగాణలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ రోజు మరో 34 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. రాష్ట్రంలో ఈ రోజు నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1132కు చేరింది. అయితే కరోనా వైరస్ సోకిన వాళ్లు ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో 75 ఏళ్ల వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నారని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 376 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు.

    రాష్ట్రంలో ప్రస్తుతం 9 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయని తెలిపిన మంత్రి ఈటల రాజేందర్... మరో 14 జిల్లాలను గ్రీన్ జోన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. నిజామాబాద్, వరంగల్ అర్బన్, సూర్యాపేట జిల్లాలను ఆరెంజ్ జోన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మాత్రమే రెడ్ జోన్‌లో ఉన్నాయని అన్నారు. దీనిపై సోమవారం కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగామని వెల్లడించారు.

    రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేయడం లేదనే ప్రచారం సరికాదని ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్రం, ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే పరీక్షలు చేస్తున్నామని...ఇదే విషయాన్ని ఈ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో వివరించామని అన్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పాతబస్తీలో కరోనా వ్యాప్తిని ఆరికట్టడంపై దృష్టి పెట్టామని అన్నారు. సీఎం కేసీఆర్... ఎప్పటికప్పుడు ఈ అంశంతో తమకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Etela rajender, Telangana

    తదుపరి వార్తలు