ప్రస్తుతం మనం అన్‌లాక్ 2లో ఉన్నాం. లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులు వచ్చాయి. ఈ క్రమంలో తాజ్‌మహల్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్మారక కేంద్రాలను తెరుస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. జూలై 6 నుంచి అన్ని స్మారక కేంద్రాల్లోకి పర్యాటకులను అనుమతిస్తామని వెల్లడించారు. ఐతే పర్యాటకులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముఖానికి మాస్క్‌ను ధరించడంతో పాటు రెండడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. పర్యాటకుల సందర్శనకు సంబంధించి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రహ్లాద్ సింగ్ చెప్పారు.
జూలై 6 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్మారక కేంద్రాలను ఓపెన్ చేయాలని నిర్ణయించాం. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం.
Have decided that all monuments can be opened with complete precautions from 6th July: Prahlad Singh Patel, Union Minister of Tourism & Culture (file pic) pic.twitter.com/4xBo8Qv9LG
— ANI (@ANI) July 2, 2020
కాగా, భారత్‌లో గడిచిన 24 గంటల్లో 19,148 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 434 మంది మరణించారు. మనదేశంలో ఇప్పటి వరకు 604,641 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 359,860 మంది కోలుకోగా.. 17,834 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 17,834 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Lockdown, Lockdown relaxations, Taj Mahal