కరోనా టెస్ట్ శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు... టెన్షన్ టెన్షన్

యూపీలోని మీరట్‌లో కొన్ని కోతులు కరోనా వైరస్ టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్లిపోయాయి.

news18-telugu
Updated: May 29, 2020, 4:15 PM IST
కరోనా టెస్ట్ శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు... టెన్షన్ టెన్షన్
కోతి (నమూనా చిత్రం)
  • Share this:
ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మెడికల్ కాలేజీలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని కోతులు కరోనా వైరస్ టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్లిపోయాయి. కరోనా వైరస్ పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్ కిట్లను ఓ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని వెళ్తుండగా కోతుల మూక దాడి చేసి ఆ టెస్ట్ కిట్లను ఎత్తుకుపోయింది. ముగ్గురు కరోనా అనుమానితులకు చేసిన టెస్ట్ శాంపిల్స్ అందులో ఉండిపోయాయి. మీరట్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ శాంపిల్స్ కోతుల వద్ద ఉండడంతో వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ కోతి మూక దాడి చేసి కరోనా టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు కూడా కొన్ని టీవీ చానళ్లలో ప్రసారం అయ్యాయి. అందులో ఓ కోతి శాంపిల్ కిట్‌ను కొరుకుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. కోతులను పట్టుకోవాలంటూ డాక్టర్లు అటవీ శాఖ అధికారుల సాయం కోరారు.
First published: May 29, 2020, 4:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading