కరోనా వ్యాక్సిన్‌పై మోడెర్నా కీలక ప్రకటన... వ్యాక్సిన్ ధర ఎంతంటే...

Coronavirus updates : ఇంకా వ్యాక్సిన్ తయారు చెయ్యకుండానే... ఫార్మా కంపెనీలు... ఎంత ధరకు అమ్మాలో నిర్ణయించేసుకుంటున్నాయి. మోడెర్నా ప్రకటన ఏంటో చూద్దాం.

news18-telugu
Updated: July 29, 2020, 7:36 AM IST
కరోనా వ్యాక్సిన్‌పై మోడెర్నా కీలక ప్రకటన... వ్యాక్సిన్ ధర ఎంతంటే...
కరోనా వ్యాక్సిన్‌పై మోడెర్నా కీలక ప్రకటన... .. (credit - twitter - reuters)
  • Share this:
కరోనా వైరస్‌కి కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న అమెరికా కంపెనీ మోడెర్నా... తాము తయారుచేయనున్న mRNA-1273 వ్యాక్సిన్ ధర ఒక్కో డోసూ... రూ.3745 నుంచి రూ.5000 దాకా ఉండొచ్చని అంచనాగా చెప్పింది. ఫిజెర్ కంపెనీ, బయోన్టెక్ కంపెనీలు తయారుచేస్తున్న వ్యాక్సిన్ కంటే... ఈ ధర రూ.800 ఎక్కువే. కరోనాకి చెక్ పెట్టాలంటే... తాము చేసే వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాలని కంపెనీ తెలిపింది. ఆ లెక్కన వ్యాక్సిన్ కోసం ప్రజలు రూ.8వేల నుంచి రూ.10వేల దాకా ఖర్చు చేయాల్సి రావచ్చు. ట్రంప్ ప్రభుత్వం... ఫిజెర్, బయోన్టెక్ తయారుచేస్తున్న వ్యాక్సిన్‌ను 5 కోట్ల మందికి ఇచ్చేందుకు 2 బిలియన్ డాలర్ల డీల్ కుదుర్చుకుంది. ఆ వ్యాక్సిన్ కంటే తమ వ్యాక్సినే పవర్‌ఫుల్ అంటున్న మోడెర్నా... ధరను మరింత ఎక్కువ చేస్తోంది. ఇప్పుడు మిగతా ఫార్మా కంపెనీలు కూడా... ఈ ధరలను లెక్కలోకి తీసుకొని... తమ వ్యాక్సిన్లకు ధరలను నిర్ణయించే అవకాశాలున్నాయి.

మోడెర్నా కంపెనీ చెబుతున్న వ్యాక్సిన్ ధర అమెరికా సహా... సంపన్న దేశాల్లో అమ్మే ధర. మరి పేద, మధ్య ఆదాయ దేశాల్లో ధర ఎంత ఉంటుందో ఇంకా తేల్చలేదు. వ్యాక్సిన్ సప్లైకి సంబంధించి ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయన్న కంపెనీ ప్రతినిధి... ధర వివరాలు చెప్పలేమన్నారు. ఇప్పుడు అంచనా ధరే ఫైనల్ అని అనుకోవడానికి లేదని, ఫైనల్ ధర మారొచ్చని మరో ప్రతినిధి తెలిపారు.

ఫిజెర్, మోడెర్నా, మెర్క్ అండ్ కో వంటి కంపెనీలు... తమ వ్యాక్సిన్లను లాభం వేసుకొనే అమ్ముతామని ప్రకటించాయి. జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి కొన్ని కంపెనీలు మాత్రం లాభం వేసుకోకుండా అమ్ముతామని ప్రకటించాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్త్రాజెనెకా కంపెనీ కలిసి తయారుచేస్తున్న వ్యాక్సిన్‌ను రూ.300 కే అమెరికా ప్రభుత్వానికి 30 కోట్ల డోసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందుకోసం అమెరికా ప్రభుత్వం ముందుగానే 1.2 బిలియన్ డాలర్లు సమకూర్చుతోంది. మోడెర్నా వ్యాక్సిన్ తయారీ, పరిశోధనల కోసం అమెరికా... ఆ కంపెనీకి దాదాపు 1 బిలియన్ డాలర్ల ఫండ్ ఇచ్చింది. ఇందుకోసం అమెరికా ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అనే విధానం తెచ్చింది. దీని ద్వారా త్వరగా వ్యాక్సిన్ చేసేలా ఫార్మా కంపెనీలకు మనీ ఇచ్చి మరీ సాయం చేస్తోంది.

ఇండియాలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ రూ.1000 దాకా ఉండొచ్చంటున్నారు. నిజంగా ఆ ధరే ఫైనల్ అయితే.. అప్పుడు మోడెర్నా వంటి కంపెనీలు కూడా తమ అంచనా ధరను తగ్గించాల్సి ఉంటుంది. ఇప్పటికైతే... ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పై ప్రపంచ ప్రజల్లో మంచి నమ్మకం ఉంది. ఈ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి వస్తుందనే అంచనా ఉంది.
Published by: Krishna Kumar N
First published: July 29, 2020, 7:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading