Sridhar Babu: మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరోనా బాడిన సంగతి తెలిసిందే. తాజాగా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కరోనా పాజటివ్‌గా నిర్దారణ అయింది.

news18-telugu
Updated: November 5, 2020, 9:24 AM IST
Sridhar Babu: మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కరోనా పాజిటివ్
శ్రీధర్ బాబు(ఫైల్ ఫొటో)
  • Share this:
తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరోనా బాడిన సంగతి తెలిసిందే. తాజాగా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కరోనా పాజటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేశారు. తనతోపాటు తన సెక్యూరిటీ సిబ్బంది శ్రీనివాస్‌కు కూడా వైరస్ సోకినట్టు శ్రీధర్ బాబు చెప్పారు. ప్రస్తుతం తామిద్దం హోం క్వారంటైన్‌లో ఉన్నామని.. తన ఆరోగ్యం నిలకడగా ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇటీవల తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.


ఇక, తెలంగాణలో కొత్తగా 1,539 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,45,682కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బుధవారం రోజున 44,327 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటివరకు 44,84,183 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు పేర్కొంది. తెలంగాణలో కరోనాతో తాజాగా 5 గురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతలు సంఖ్య 1,362కి చేరింది.
Published by: Sumanth Kanukula
First published: November 5, 2020, 9:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading