కరోనా కట్టడిలో ఎమ్మెల్యే రేగా కాంతారావు అరుదైన నిర్ణయం...

నియోజకవర్గ అభివృద్ధి నిధి రూ. 3 కోట్లు కూడా ముఖ్యమంత్రి సహాయనిధికే కరోనా నివారణ చర్యల నిమిత్తం ప్రకటించి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు నియోజక వర్గ నిధులను కరోనాకట్టడికి ఇచ్చిన తొలి ఎమ్మెల్యేగా రేగా కాంతారావు గుర్తింపు పొందారు.

news18-telugu
Updated: March 26, 2020, 1:42 PM IST
కరోనా కట్టడిలో ఎమ్మెల్యే రేగా కాంతారావు అరుదైన నిర్ణయం...
ఎమ్మెల్యే రేగా కాంతారావు
  • Share this:
ముఖ్యమంత్రి కరోనా సహాయ నిధికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఒక నెల వేతనాన్ని అందించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధి రూ. 3 కోట్లు కూడా ముఖ్యమంత్రి సహాయనిధికే కరోనా నివారణ చర్యల నిమిత్తం ప్రకటించి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు నియోజక వర్గ నిధులను కరోనాకట్టడికి ఇచ్చిన తొలి ఎమ్మెల్యేగా రేగా కాంతారావు గుర్తింపు పొందారు. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనావైర్‌సను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు అమలు చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. కరోనా బాధితుల సహయార్థం సీఎం సహయనిధికి తన మార్చి నెల వేతనాన్ని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు కూడా తన ఒక నెల వేతనం రూ.3,82,000లను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన అనేక పటిష్ట కార్యక్రమాల అమలుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు వ్యాపారవేత్తలు, స్వచ్ఛందంగా సంస్థలు, విద్యా సంస్థలు, యాజమాన్యాలు తమకు తోచినంతగా సీఎం సహాయ నిధికి ఆర్ధిక సాయంగా విరాళాలందించాలని కోరారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు