Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Coronavirus:కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ఎపిటోప్స్ డిజైన్ చేసిన హెచ్‌సీయూ అధ్యాపకురాలు..

    హెచ్‌సీయూకి చెందిన ప్రొఫెసర్ సీమా మిశ్రా.. కరోనా వైరస్ నియంత్రణకు కావాల్సిన వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కావాల్సిన ఎపిటోప్స్‌ను రూపొందించింది. ఇవి ల్యాబ్ ప్రయోగాల్లో విజయవంతమైతే.. పది రోజుల్లోనే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.

    news18-telugu
    Updated: March 28, 2020, 4:19 PM IST
    Coronavirus:కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ఎపిటోప్స్ డిజైన్ చేసిన హెచ్‌సీయూ అధ్యాపకురాలు..
    సీమా మిశ్రా(ఫైల్ ఫొటో)
    • Share this:
    ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో హెచ్‌సీయూ అధ్యాపకురాలు కీలక అడుగు వేసింది. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ఎపిటోప్స్ డిజైన్‌ను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీమా మిశ్రా రూపొందించారు. ఈ మేరకు హెచ్‌సీయూ ఒక ప్రకటనను విడుదల చేసింది. యూనివర్సిటీలోని లైఫ్ సైన్సెస్ విభాగంలో బయోకెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ అధ్యాపకురాలిగా సీమా మిశ్రా పనిచేస్తోంది. అయితే ఈమె ఆన్‌లైన్‌లో టీ-సెల్ ఎపిటోప్స్ డిజైన్‌ను తయారు చేశారు. అంతకుముందు సీమా వైరస్‌కు సంబంధించిన స్ట్రక్చర్, నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఉపయోగపడే ఫార్ములాను కంప్యూటర్ సాయంతో కనుగొన్నారు.

    సీమా మిశ్రా రూపొందించిన డిజైన్స్ ద్వారా వైరస్‌కు చుట్టూ ఉండే ప్రోటీన్లపై ప్రయోగించి వాటిని నాశనం చేయోచ్చు. అయితే ల్యాబ్స్‌లో చేసే ప్రయోగాల్లో ఎపిటోప్స్ విజయవంతంగా పనిచేస్తే కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన వ్యాక్సిన్ తయారు చేసే వీలుంటుంది. నిజానికి టీ-సెల్ ఎపిటోప్స్ సాయంతో పదిరోజుల్లోనే వ్యాక్సిన్ తయారు చేసే వీలుంది. సీమా మిశ్రా రూపొందించిన ఎపిటోప్స్ కేవలం వైరస్ ప్రోటీన్లపైనే పనిచేస్తాయని, మనిషికి సంబంధించిన ప్రోటీన్లపై దుష్ర్పభావం పడదని ఆమె చెబుతున్నారు. అయితే మిశ్రా తయారు చేసిన ఎపిటోప్స్‌పై ఈమె చేసిన ఆన్‌లైన్ అధ్యయనాన్ని కెమ్‌రిక్సివ్ అనే జర్నల్ కు పంపినట్టు మిశ్రా చెబుతోంది.
    Published by: Narsimha Badhini
    First published: March 28, 2020, 4:18 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading