భారతీయ రైల్వే ప్రస్తుతం శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. రోజూ ఈ రైళ్లు వలస కార్మికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. మే 1 నుంచి 28 నాటికి 3840 శ్రామిక్ రైళ్లలో 52 లక్షల మంది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చింది భారతీయ రైల్వే. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించేవారికి ముఖ్యమైన సూచనల్ని జారీ చేసింది రైల్వే. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు శ్రామిక్ రైళ్లలో ప్రయాణిస్తున్నట్టు భారతీయ రైల్వే గుర్తించింది. దీని వల్ల ఆ ప్రయాణికులు కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో ఉన్నవాళ్లు రైలు ప్రయాణంలో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు బయటపడ్డాయి. దీంతో ప్రయాణికుల భద్రత కోసం ముఖ్యమైన సూచనల్ని చేసింది రైల్వే.
హైపర్టెన్షన్, డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు, గర్భిణీలు, 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడ్డ వృద్ధులు రైలు ప్రయాణాన్ని చేయకూడదని రైల్వే కోరుతోంది. అత్యవసరమైతే తప్ప రైల్వే ప్రయాణం చేయొద్దని సూచిస్తోంది. భారతదేశంలోని పౌరులందరికీ ప్రయాణ అవసరాల్ని తీర్చేందుకు భారతీయ రైల్వే 24 గంటలూ పనిచేస్తోందని, తమకు పౌరుల మద్దతు కావాలని రైల్వే కోరుతోంది. ప్రయాణంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు ఉంటే రైల్వే సిబ్బందిని సంప్రదించాలని, 139, 138 రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని రైల్వే సూచిస్తోంది.
ఇక జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైళ్లను నడుపుతోంది భారతీయ రైల్వే. ఈ రైళ్లకు టికెట్ బుకింగ్స్ ఇప్పటికే కొనసాగుతున్నాయి. జూన్ 1 నుంచి రైళ్లలో ప్రయాణించేవారికి ప్రత్యేకమైన నిబంధనల్ని అమలు చేస్తోంది రైల్వే. ఆ రూల్స్ పాటించేవారిని మాత్రమే రైలులో ప్రయాణించేందుకు అవకాశం ఇస్తోంది. ఆ రూల్స్ గురించి తెలుసుకోవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Special Trains: రైలు టికెట్ కన్ఫామ్ అయిందా? ట్రైన్ ఎక్కాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే
Special Trains: జూన్ 1 నుంచి నడిచే 200 స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే
Special Trains: ప్రత్యేక రైళ్లకు ప్రారంభమైన బుకింగ్... టికెట్లు తీసుకోండి ఇలాPublished by:Santhosh Kumar S
First published:May 29, 2020, 16:39 IST