Railways: వలస కూలీలకు రైల్వే శుభవార్త... రూ.1800 కోట్లతో ఉపాధి

Garib Kalyan Rojgar Abhiyaan | వలస కూలీలకు భారీగా ఉపాధి అవకాశాలను ప్రకటించింది భారతీయ రైల్వే. అక్టోబర్ చివరి నాటికి రూ.1800 కోట్ల విలువైన పనులు చేయిస్తామని తెలిపింది.

news18-telugu
Updated: June 25, 2020, 9:10 AM IST
Railways: వలస కూలీలకు రైల్వే శుభవార్త... రూ.1800 కోట్లతో ఉపాధి
Railways: వలస కూలీలకు రైల్వే శుభవార్త... రూ.1800 కోట్లతో ఉపాధి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లాక్‌డౌన్ సమయంలో వలసకూలీల కష్టాలు దేశ ప్రజలందర్నీ కదిలించాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు భార్యాపిల్లలతో వలసకూలీలు వందల కిలోమీటర్లు నడిచిన దృశ్యాలు ఇప్పటికీ కలచివేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకంలో భాగంగా వలస కూలీలకు అద్భుత అవకాశాన్ని అందిస్తోంది భారతీయ రైల్వే. 2020 అక్టోబర్ 31 లోగా రూ.1800 కోట్ల విలువైన ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు రైల్వే ప్రకటించింది. మౌలిక వసతుల ప్రాజెక్టులలో వచ్చే 125 రోజుల్లో అమలు 8 లక్షల పనిదినాలు కల్పించనున్నట్టు ప్రకటించింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 20న గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.50,000 కోట్లతో మౌలిక వసతుల నిర్మాణం చేపడతామని పీఎం మోదీ ప్రకటించారు. అందులో భాగంగా భారతీయ రైల్వే రూ.1800 కోట్ల విలువైన పనులు చేపడుతోంది. ఈ పథకం కోసం ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఈ రాష్ట్రాల్లో 116 జిల్లాల్లో వలస కార్మికులకు ఉపాధి కల్పించనుంది రైల్వే. ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఆయా రైల్వే జోన్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ వలస కూలీలకు ఉపాధి కల్పించాలని చర్చించారు. ఈ ప్రాజెక్టుల్లో పనిచేసే వలస కార్మికులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని జోనల్ స్థాయి అధికారులను కోరారు.


అక్టోబర్ 31 వరకు భారతీయ రైల్వే పలు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయనుంది. లెవెల్ క్రాసింగ్స్ దగ్గర అప్రోచ్ రోడ్ల నిర్మాణం, ట్రాక్ పక్కన ప్రవాహాల్లో, మురుగునీటి కాల్వల్లో పూడిక తీయటం, రైల్వే స్టేషన్లకు వెళ్లే రోడ్ల నిర్మాణం, నిర్వహణ, రైల్వే పరిధిలో ట్రాక్ పక్కనున్న ప్రాంతాల విస్తరణ పనులు, రైల్వే భూమి అంచుల్లో మొక్కలు నాటడం, వంతెనలు, చెట్లు కాపాడే పనులు చేయడం లాంటి వాటి కోసం వలస కూలీలను నియమించుకోనున్నారు.గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకంలో భాగంగా రైల్వేతో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, రోడ్డు రవాణా, గనులు, త్రాగు నీరు, పారిశుద్ధ్యం, పర్యావరణం, పెట్రోలియం, సహజవాయువు, సరిహద్దు రహదారులు, టెలికామ్, వ్యవసాయం లాంటి 12 వేరువేరు శాఖల సమన్వయంతో పనులు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి:

Paytm: డబ్బులు లేవా? అయినా రూ.1,00,000 వరకు షాపింగ్ చేయొచ్చు

SBI: కరెన్సీ నోట్లు పాడయ్యాయా? ఎస్‌బీఐలో ఫ్రీగా మార్చుకోండి ఇలా

SBI account: ఎస్‌బీఐ అకౌంట్ 4 నిమిషాల్లో... ఆన్‌లైన్‌లో తీసుకోండి ఇలా
First published: June 25, 2020, 9:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading