నాకు కరోనా వస్తే... తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా విషయంలో అలర్ట్ చేయడంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు.

news18-telugu
Updated: July 14, 2020, 12:36 PM IST
నాకు కరోనా వస్తే... తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా సోకకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నా... చాలామంది కరోనా బారిన పడుతున్నారు. ఇక ప్రజల్లో ఎక్కువగా తిరిగే ప్రజాప్రతినిధులకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. వారిలో మెజార్టీ నేతలు ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు. మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత వంటి వాళ్లు ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్నారు. అయితే తనకు కరోనా వస్తే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటానని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. భౌతిక దూరం మన దేశంలో సాధ్యంకాదని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వస్తే వెలివేసే విధానం సమాజంలో ఉందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. బాధ్యత లేని కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. కరోనా విషయంలో అలర్ట్ చేయడంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు.
Published by: Kishore Akkaladevi
First published: July 14, 2020, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading