ఏప్రిల్, మే నెలల్లోనూ... ఏపీ మంత్రి వార్నింగ్

ఏప్రిల్, మే నెలల్లోనూ... ఏపీ మంత్రి వార్నింగ్

మంత్రి పేర్నినాని

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోగలుగుతున్నామన్న మంత్రి పేర్ని నాని... కొంత మంది మనకేం కాదనే భావనలో కట్టడి లేకుండా రోడ్ల మీదకు వచ్చి కరోనా వ్యాప్తికి సహకరిస్తున్నారని ఆరోపించారు.

 • Share this:
  కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రి పేర్ని నాని సూచించారు. మనలో మార్పు రాకుంటే ఏప్రిల్, మే మాసాల్లో ఈ పరిస్థితులు ఉండవని ఆయన హెచ్చరించారు. ఒక్కసారి కరోనా పాజిటీవ్ కేసులు రెట్టింపైతే మనమంతా అచేతలం కాక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోగలుగుతున్నామన్న మంత్రి పేర్ని నాని... కొంత మంది మనకేం కాదనే భావనలో కట్టడి లేకుండా రోడ్ల మీదకు వచ్చి కరోనా వ్యాప్తికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కనుక మనమంతా కలిసి కరోనాను కట్టడి చేయకుంటే అమెరికా, ఇటలీల దుస్థితే మనకు వస్తుందని హెచ్చరించారు.

  ప్రపంచ మొనగాడిని నేనే అన్న అమెరికా నేడు ఇటలీని మించిపోయిందని... అమెరికా అక్కడి ప్రజలను విచ్చలవిడిగా రోడ్ల మీదకు వదిలేయటంతో నేడు ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు. ఆ పరిస్థితులు మనకు రాకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రటించాయని మంత్రి తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని... యువత తమతమ బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరించాలని సూచించారు.

  మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను గమనించి మన రాష్ట్ర ప్రజానీకం స్వీయ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటిని, వంటిని శుచిగా పెట్టుకుని కొన్ని రోజులు మాంసాహారాల జోలికి వెళ్లకుండా రోగ నిరోధక శక్తి ఉన్న కూరగాయలనే వంటకాలుగా చేసుకుని తిని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు