Nayini Narsimha Reddy: నాయినికి హరీష్ రావు పరామర్శ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

Nayini Narsimha Reddy: నాయినికి హరీష్ రావు పరామర్శ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

నాయిని నర్సింహారెడ్డిని పరామర్శిస్తున్న మంత్రి హరీష్ రావు

Nayini Narsimha Reddy: తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న నాయిని నర్సింహారెడ్డిని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. నాయిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

  • Share this:
    తెలంగాణ మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు కరోనా సోకడంతో ముందు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే అనంతరం నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ వచ్చినా ఆయన ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నాయిని నర్సింహారెడ్డిని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. నాయిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం నాయిని కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. హరీష్ రావు వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఇటీవల నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ సైతం పరామర్శించారు. కాగా.. ఇప్పటికీ నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

    సెప్టెంబర్ 28న నాయిని నర్సింహారెడ్డికి కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. ఎప్పుడు యాక్టీవ్ గా, శారీరకంగా స్ట్రాంగ్ గా కనిపించే నాయిని త్వరలోనే కోలుకుంటారని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఆయనకు వారం క్రితం మరో సారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటీవ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కూడా అవుతారని అంతా భావించారు.

    అయితే ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఆయన ఆరోగ్యం విషమించింది. ఊపిరి తీసుకోవడమే ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులు టెస్టులు చేయగా ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకి న్యుమోనియా వచ్చిందని గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం కోసం ఆయనను జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నాయినిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
    Published by:Nikhil Kumar S
    First published: