హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. కరీంనగర్ ప్రజలకు మంత్రి సూచన

ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. కరీంనగర్ ప్రజలకు మంత్రి సూచన

మంత్రి గంగుల, కలెక్టర్ శశాంక్ మీడియా సమావేశం

మంత్రి గంగుల, కలెక్టర్ శశాంక్ మీడియా సమావేశం

కరీంనగర్ నగర ప్రజలు ఎవరూ తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్ళవద్దని సూచించారు. గురువారం నుంచి నిత్యవసర వస్తువులు మినహా మిగతా షాపులన్నీ మూసివేయాలని ఆదేశించారు.

  తెలంగాణలో ఇప్పటి వరకు 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కోలుకోవడంతో.. ప్రస్తుతం 5 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఐతే వీరిలో కరీంనగర్‌కు చెందిన వ్యక్తి ఉన్నారన్న సమాచారంతో.. నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇటీవల ఇండోనేసియాలో పర్యటించిన  సదరు వ్యక్తి మార్చి 13న ఇండియాకు వచ్చాడు.  పరీక్షల్లో  అతడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతడు ఎక్కడెక్కడ తిరిగాడు..ఎవరెవరిని కలిశాడన్న వివరాలను సేకరిస్తున్నారు.

  కరీంనగర్‌లోని ఓ ప్రార్థనామందిరంలో రెండు రోజులు గడిపినట్లు అధికారుల దృష్టికి వచ్చింది.  ఈ క్రమంలో బుధవారం మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక్‌తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నగర ప్రజలకు కీలక సూచనలు చేశారు. కరీంనగర్ నగర ప్రజలు ఎవరూ  తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్ళవద్దని సూచించారు. గురువారం నుంచి నిత్యవసర వస్తువులు మినహా మిగతా షాపులన్నీ మూసివేయాలని ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్‌కు 100 మీటర్ల పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి అందిరికీ రక్తపరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శశాంక్ తెలిపారు.  ఈ నేపథ్యంలో నగర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఐతే ఎవరూ భయపడాల్సిన పనిలేని.. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

  వీడియో ఇక్కడ చూడండి:

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Covid-19, Karimangar, Telangana

  ఉత్తమ కథలు