తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషీలో కరోనా కలకలం రేపింది. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరు డ్రైవ ర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్మెన్లు ఉన్నారు. దీంతో మంత్రి ఈటలకు, మిగతా సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, మంత్రి పేషీలో ఏడుగురికి కరోనా సోకడంతో.. బీఆర్కే భవన్లో ఆయన కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. కరోనా కేసుల నేపథ్యంలో మంత్రి ఈటల.. శుక్రవారం తన కార్యాలయానికి వెళ్లలేదని, ఇంట్లోనే సందర్శకులను కలిశారని అధికారులు తెలిపారు.
ఇక, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో మరో 2,123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ మరో 9 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,169కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం మృతుల సంఖ్య 1,025గా నమోదైంది. నిన్న కరోనాతో కోలుకున్న 2,151 కరోనా నుంచి కోలుకోవడంతో.. ఇప్పటివరకు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,37,508కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,636 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24,070 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.