పరీక్షలు చేయకుండానే కరోనా పేషెంట్లు డిశ్చార్జ్... తెలంగాణ మంత్రి ప్రకటన

తెలంగాణలో కరోనా పేషెంట్లను డిశ్చార్జ్ చేసే విషయంలో ఐసీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్‌ను పాటిస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

news18-telugu
Updated: May 16, 2020, 7:23 PM IST
పరీక్షలు చేయకుండానే కరోనా పేషెంట్లు డిశ్చార్జ్... తెలంగాణ మంత్రి ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వల్లనే రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) మార్గనిర్ధేశకాల ప్రకారమే వీరందరికీ చికిత్స అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తాజాగా పలు కీలక మార్పులతో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ విడుదల చేసిందని... వాటి ప్రకారం డిశ్చార్జ్ పాలసీ, హోమ్ ఐసోలేషన్, డెత్ గైడ్ లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. హోమ్ ఐసోలేషన్ కొరకు మే10వ తేదీన విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రైమరీ, సెకండరీ, టెర్శరీ కాంటాక్ట్స్‌ను లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇలా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని ఉదయం సాయంత్రం మెడికల్ టీమ్‌లు పరీక్షలు చేస్తారని, వారికి అవసరం అయిన నిత్యావసరవస్తువులు అన్నీ GHMC ద్వారా అందిస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలియజేశారు. సమన్వయం కోసం ప్రత్యేక నోడేల్ ఆఫీసర్ కూడా నియమించాని తెలిపారు. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు దాస్తే దాగవు అని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని… హైదరాబాద్‌లో యాక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్న నోడల్ అధికారులు, డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు.

ఇక కరోనా పేషెంట్లకు చికిత్స, డిశ్చార్జ్ విధానానికి సంబంధించి ఐసీఎంఆర్ కొత్త రోజుల క్రితం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. దీని ప్రకారం కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను పది రోజుల పాటు చికిత్స అందించిన తరువాత ఎటువంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జ్ చేయవచ్చు. ఇలా డిశ్చార్జ్ అయిన వారిని మరో ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉంచాలి. ఒకవేళ మళ్లీ లక్షణాలు ఎక్కువ ఉన్నా, ఇతర ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషంట్లను మాత్రం హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ నిర్దేశించింది.

కరోనా మరణాల విషయంలో కూడా ఐసీఎంఆర్ కొత్త గైడ్ లైన్స్ ప్రకటించింది. వీటి ప్రకారం కాన్సర్, గుండెజబ్బులు, లేదా ఇతర జబ్బులతో చనిపోయిన వారికి కరోనా పాజిటివ్ ఉన్నా... వారు దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయినట్టుగానే పరిగణించాలని కొత్త నిభందనలు చెబుతున్నాయి. ఈ మరణాల కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుంది. వారిచ్చిన డెత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే మరణాలను ప్రకటించాలని ఐసీఎంఆర్ తెలిపింది.
Published by: Kishore Akkaladevi
First published: May 16, 2020, 7:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading