తెలంగాణలో ప్రస్తుతానికి కరోనా వైరస్ భయాన్ని అధిగమించామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లా వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారిలో మాత్రమే ఎక్కువ ఇబ్బంది ఉందని ఆయన వివరించారు. కరోనా పరీక్షలను మరింతగా పెంచుతున్నామని ఈటల రాజేందర్ వివరించారు. ప్రతి పీహెచ్సీలో పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. జ్వరం వచ్చిన వారందరనీ వీలైనంత త్వరగా గుర్తించి ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంతో పాటు కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
ఇక తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లోనే టెస్టులు సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వేల సంఖ్యలో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను పలు జిల్లాలకు పంపించింది. గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహించేందుకు కావాల్సిన కిట్లను సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్ ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.