Home /News /coronavirus-latest-news /

MINISTER ETELA RAJENDAR ANGRY ON OFFICIALS WHO SAID COMMUNITY TRANSMISSION IN TELANGANA AK

కరోనా సామాజిక వ్యాప్తి వ్యాఖ్యలపై మంత్రి ఈటల ఆగ్రహం

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

అధికారులు మాట్లాడిన తరువాత మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఈటల రాజేందర్.. తెలంగాణలో కరోనా వ్యాప్తి సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని అన్నారు.

    తెలంగాణలో కరోనా వ్యాప్తి సామాజిక వ్యాప్తిదశలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు కీలక సూచనలు చేసిన హెల్త్ డైరెక్టర్... రాబోయే నాలుగు వారాల పాటు తెలంగాణ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే హెల్త్ డైరెక్టర్, ఇతర అధికారులు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని.. అలాంటిది తెలంగాణలో కమ్యూనిటి దశకు చేరుకుంది..? అని ఎలా ప్రకటిస్తారని అధికారులను మంత్రి ఈటల రాజేందర్ నిలదీశారు. అధికారులు మాట్లాడిన తరువాత మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఈటల రాజేందర్.. తెలంగాణలో కరోనా వ్యాప్తి సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని అన్నారు.

    అంతకుముందు తెలంగాణలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని.. ఈ క్రమంలో నాలుగైదు వారాలపాటు పరిస్థితి క్లిష్టంగా ఉంటుందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాదులో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ... ద్వితీయ శ్రేణి నగరాల్లో మాత్రం వైరస్ విస్తరిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. వైద్య సిబ్బంది కూడా చాలా ఒత్తిడిలో ఉన్నారని.. రానున్న నాలుగైదు వారాలు చాలా క్లిష్టంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనా పేషెంట్లకు తక్షణమే చికిత్సనందిస్తేనే మంచిదని తెలిపారు. .
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Etela rajender, Telangana

    తదుపరి వార్తలు