వ్యాధి లక్షణాలు లేని కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఇంటి వద్దే చికిత్స అందించాలని అధికారులకు మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గాంధీ ఆస్పత్రికి పంపించాలని స్పష్టం చేశారు. బుధవారం జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, PHC మెడికల్ ఆఫీసర్స్‌తో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటల పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నీ ఆసుపత్రుల్లో రెండు ఓపీలు ఉండాలని.. ఒకటి ఫీవర్ ఓపీకాగా, రెండోది సాధారణ ఓపీ అని ఆయన తెలిపారు. కరోనా భయం నుండి ప్రజలను బయటకు రప్పించాలని అధికారులకు సూచించారు మంత్రి ఈటల రాజేందర్.
మంగళవారం రాత్రి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. ఇక కరోనా వైరస్‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1742 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2030 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 148కి చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Eetala rajender, Gandhi hospital, Telangana