ప్రైవేట్ ఆస్పత్రులకు మంత్రి ఈటల మరోసారి తీవ్ర హెచ్చరిక.. లేదంటే..

ఈటల రాజేందర్

అధిక బిల్లుల వసూళ్లపై ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి 1039 ఫిర్యాదులు అందాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామన్న ఆయన.. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు వాటి తీరును మార్చుకోవాలని సూచించారు.

 • Share this:
  కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వసతలు లేవని, సరైన చికిత్స ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారని ప్రైవేట్ ఆస్పత్రులపై రోగుల బంధువులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోపోతే 50శాతం పడకల ప్రభుత్వ ఆధీనంలోని తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై సమీక్షించారు.

  అధిక బిల్లుల వసూళ్లపై ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి 1039 ఫిర్యాదులు అందాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామన్న ఆయన.. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు వాటి తీరును మార్చుకోవాలని సూచించారు తెలంగాణ మంత్రి. లేదంటే 50శాతం పకడలు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

  తెలంగాణలో ఇప్పటి వరకు 80751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా కరోనా కారణంగా 10 మంది చనిపోగా... తెలంగాణలో వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 637కు చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు 57586 కోలుకోగా.. యాక్టివ్ కేసులు సంఖ్య 22528గా ఉంది. నిన్న ఒక్క రోజు 11,609 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య 624840కు చేరింది. మరో 1,700 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య,ఆరోగ్యశాఖ వివరించింది. తెలంగాణలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉంది. కరోనా సోకిన 15789 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: