ఏపీ మంత్రికి కరోనా పాజిటివ్.. ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా..

కొద్ది రోజుల నుంచి స్వల్ప జ్వరంలో బాధపడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

news18-telugu
Updated: August 5, 2020, 8:39 AM IST
ఏపీ మంత్రికి కరోనా పాజిటివ్.. ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రానికి చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజుల నుంచి స్వల్ప జ్వరంలో బాధపడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మొదట్లో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే మంగళవారం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న బాలినేనికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

Minister Balineni srinivas reddy news, Balineni srinivas reddy news, corona virus for balineni Srinivas reddy, karanam balaram, anna rambabu, prakasam district, corona virus, ap news, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కరోనా, కరణం బలరాం, అన్నా రాంబాబు, ఏపీ న్యూస్
బాలినేని శ్రీనివాస రెడ్డి(ఫైల్ ఫోటో)


మరోవైపు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంతో పాటు ఆయన కుమారుడు వెంకటేశ్‌కు కూడా కరోనా సోకింది. కరణం బలరాం హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో చేరారు. అయన కుమారుడు వెంకటేశ్‌ మాత్రం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన భార్యకు కూడా వైరస్‌ ఉన్నట్లు తేలింది. దీంతో వారంతా ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరారు.
Published by: Kishore Akkaladevi
First published: August 5, 2020, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading