Asaduddin Owaisi: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి అసదుద్దీన్ రిక్వెస్ట్..

Asaduddin Owaisi: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి అసదుద్దీన్ రిక్వెస్ట్..

అసదుద్దీన్ ఓవైసీ(ఫైల్ ఫొటో)

Asaduddin Owaisi: లాక్‌డౌన్ల కారణంగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందిపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Share this:
    తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పది రోజుల లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌పై అనేక మంది అనేక విధాలుగా స్పందించారు. కొందరు లాక్‌డౌన్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందే అని అభిప్రాయపడగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం హఠాత్తుగా లాక్‌డౌన్‌ విధించి ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. లాక్‌డౌన్ల కారణంగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందిపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. పదిరోజులు లాక్‌డౌన్ విధించిన తెలంగాణ ప్రభుత్వం.. పేదలకు అండగా ఉంటుందనే నమ్మకం కలిగించాలని కోరారు. అంతేకాదు పది రోజుల తరువాత ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ పొడిగించవద్దని అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ విధించడం ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినప్పటికీ.. కొన్ని ఇతర కారణాల వల్ల సర్కార్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

    ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. పది తర్వాత మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు జన సంచారంపై కఠిన నియంత్రణలు ఉంటాయి. మరోవైపు టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు