Telangana: కరోనా కట్టడి.. తెలంగాణలో మైక్రో కంటైన్మెంట్ జోన్లు.. ఏ జిల్లాలో ఎన్నంటే..

Telangana: కరోనా కట్టడి.. తెలంగాణలో మైక్రో కంటైన్మెంట్ జోన్లు.. ఏ జిల్లాలో ఎన్నంటే..

ప్రతీకాత్మక చిత్రం

Telangana: కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధించిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న విధంగానే తెలంగాణలోనూ వైరస్ విస్తరిస్తోంది. రోజుకు 5 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధించిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటివరకు జీహెచ్‌ఎంసీ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పరిధికే పరిమితమైన వైరస్‌ వ్యాప్తి గడిచిన వారంలో అన్ని జిల్లాల్లోనూ తీవ్రమైంది. గ్రామీణ జిల్లాల పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

    దీంతో అధికారులు రాష్ట్రంలో 495 మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ 11, భదాద్రి కొత్తగూడెం 13, హైదరాబాద్ 70, జగిత్యాల 6, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 10, జోగులాంబ గద్వాల 9, కామారెడ్డి 2, కరీంనగర్ 10, ఖమ్మం 25, కొమురంభీం ఆసిఫాబాద్ 18, మహబూబ్‌నగర్ 4, మంచిర్యాల 10, మెదక్ 7, మేడ్చల్ మల్కాజ్‌గిరి 32, ములుగు 18, నాగర్‌కర్నూల్ 13, నల్గొండ 16, నిర్మల్ 32, నిజామాబాద్ 66, పెద్దపల్లి 7, రాజన్న సిరిసిల్ల 8, రంగారెడ్డి 23, సంగారెడ్డి 3, సిద్దిపేట 1, సూర్యాపేట 20, వికారాబాద్ 29, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 11, యాదాద్రి భువనగిరి 16 మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరీక్షలను ఎక్కువగా చేస్తున్న ప్రభుత్వం.. కరోనా రోగులకు అందిస్తున్న వైద్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది.
    Published by:Kishore Akkaladevi
    First published: