వలస కార్మికులకు ఊరట... కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు...

వలస కార్మికులకు ఊరట... కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు...

ప్రతీకాత్మక చిత్రం

వలస కార్మికులకు ఊరట కలిగించేలా కేంద్ర హోంశాఖ కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

 • Share this:
  వలస కార్మికులకు ఊరట కలిగించేలా కేంద్ర హోంశాఖ కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారం ఏప్రిల్ 20 తర్వాత గ్రీన్ జోన్లలో పరిశ్రమలు, తయారీ రంగం, నిర్మాణ రంగం, వ్యవసాయం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లవచ్చు. అయితే, వలస కార్మికులు ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నారో, ఆ రాష్ట్రంలోనే పనులు చేసుకోవచ్చు. రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం దాటడానికి వీల్లేదు. తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది.

  కేంద్ర హోంశాఖ జారీచేసిన కొత్త మార్గదర్శకాలు


  కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలు
  1. వలస కార్మికులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో, ఆయా ప్రాంతంలో స్థానిక అధారిటీ వద్ద తమ నైపుణ్యం గురించి తెలియజేసి రిజిస్టర్ చేయించుకోవాలి. (వారికి సంబంధించిన పనులు ఉంటే స్థానిక అధారిటీ వారికి తెలియజేస్తుంది)
  2. వలస కూలీల సమూహం తమ సొంత గ్రామాలకు లేదా తమకు పని దొరికే ప్రాంతానికి (అదే రాష్ట్రంలో) వెళ్లాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పంపించవచ్చు. అయితే, వారికి పూర్తిగా వైద్య పరీక్షలు నిర్ధారించి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తేలిన తర్వాతే పంపాలి.
  3. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోకి వలస కూలీలు ప్రయాణాలు నిషేధం.
  4. సొంత గ్రామాలకు వెళ్లే వారు పూర్తిగా సామాజిక దూరం పాటించాలి. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సులను శానిటైజ్ చేయాలి.
  5. ఏప్రిల్ 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ 19 నివారణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి.
  6. వలస కార్మికులు ప్రయాణాలు చేసే సమయంలో స్థానిక అధికారయంత్రాంగం వారికి ఆహారం, మంచినీళ్లు లాంటివి అందించాలి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: