3 పైసల ఈ టాబ్లెట్‌తో కరోనాకు చెక్.. విదేశాల్లో అద్భుత ఫలితాలు

ఒక్కో మెట్ఫార్మిన్ టాబ్లెట్ ధర భారత కరెన్సీలో 3 మూడు పైసలు మాత్రమే. అంటే ఒక రూపాయికి 33 టాబ్లెట్స్ వస్తాయి. ఈ టాబ్లెట్లను పేద దేశాలకు సరఫరా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

news18-telugu
Updated: July 2, 2020, 6:21 PM IST
3 పైసల ఈ టాబ్లెట్‌తో కరోనాకు చెక్.. విదేశాల్లో అద్భుత ఫలితాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యావత్ ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు లేదు. ఎన్నో దేశాలు ఆ ప్రయత్నాలో ఉన్నాయి. కోవిడ్‌ను నయం చేసే డ్రగ్‌తో పాటు రాకుండా అడ్డుకునే వాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. ఐతే ప్రస్తుతానికి చాలా దేశాలు కొన్ని మందులను ప్రయోగిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నాయి. రెమడిసివిర్, పావిపిరవిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్, డెక్సా మెథాసోన్ వంటి మందులు ఈ కోవలోకే వస్తాయి. ఈ యాంటీ వైరల్ డ్రగ్స్‌తో కరోనా పేషెంట్లు కొంత మేర కోలుకుంటున్నారు. మరణాల రేటు కూడా తగ్గుతోంది. ఈ జాబితాలోకి మరో ముందు వచ్చి చేరింది. అదే మెట్ఫార్మిన్ (Metformin).

ఈ మెట్ఫార్మిన్ టాబ్లెట్లను టైప్-2 డయాబెటిస్ చికిత్సలో వినియోగిస్తారు. ఐతే మెట్‌ఫార్మిన్ టాబ్లెట్లతో కరోనాను కట్టడి చేయవచ్చని పలు పరిశోధనల్లో తేలింది. కరోనా వైరస్ పుట్టిన వుహాన్ సిటీలోనూ మెట్ఫార్మిన్ మందును పేషెంట్లకు ఇచ్చి మంచి ఫలితాలు రాబట్టారు చైనీస్ డాక్టర్లు. దీన్ని వండర్ డ్రగ్‌గా అభివర్ణించారు. మెట్ఫార్మిన్ డ్రగ్ తీసుకున్న పేషెంట్లలో మరణాలు రేటు తక్కువగా ఉందని చెప్పారు. అంతేకాదు NHS ఆమోదంతో యూకేలోనూ ఉపయోగిస్తున్నారు. యూనివర్సిటీలో ఆఫ్ మిన్నెసోటాలోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఇప్పటికే ఎంతో మందిపై డ్రగ్‌ను ప్రయోగించగా.. మరణాల రేటు తక్కువగా నమోదయిందని పరిశోధకులు తెలిపారు.

ప్రస్తుతం డెక్సా మెథాసోన్ కూడా సత్ఫలితాలను ఇస్తోంది. విషమ పరిస్థితిలో ఉన్న కరోనా రోగులకు డెక్సా మెథాసోన్ స్టరాయిడ్ ఇవ్వగా చాలా మంది కోలుకున్నారు. ఈ డ్రగ్ వాడిన తర్వాత వెంటిలేటర్ సపోర్టుతో ఉన్న వారిలో మరణాల రేటు ఐదో వంతు తగ్గింది. ఐతే డెక్సా మెథాసోన్‌లాగే మెట్ఫార్మిన్ కూడా చాలా చౌకయిన మందు. ఒక్కో మెట్ఫార్మిన్ టాబ్లెట్ ధర భారత కరెన్సీలో 3 మూడు పైసలు మాత్రమే. ఈ టాబ్లెట్లను పేద దేశాలకు సరఫరా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనాకు పూర్తి స్థాయి డ్రగ్ వచ్చే వరకు ఈ మందును వాడవచ్చని.. తద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచచని చెబుతున్నారు.


First published: July 2, 2020, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading