కరోనా టెన్షన్... గాలి బుడగల్లో ప్రయాణం... వైరస్ సోకకుండా ప్లాన్

Coronavirus updates : అందరూ కలిసిమెలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగే రోజుల్ని గతేడాది వరకూ చూశాం. ఇప్పుడో ఇలాంటి చిత్రమైనవి చూడాల్సి వస్తోంది.

news18-telugu
Updated: July 29, 2020, 12:05 PM IST
కరోనా టెన్షన్... గాలి బుడగల్లో ప్రయాణం... వైరస్ సోకకుండా ప్లాన్
కరోనా టెన్షన్... గాలి బుడగల్లో ప్రయాణం... వైరస్ సోకకుండా ప్లాన్ (photo from Facebook)
  • Share this:
అందరికీ తెలుసు సోషల్ డిస్టాన్స్ పాటించకపోతే కరోనా సోకే ప్రమాదం ఉందని. కానీ చాలా మంది పాటించట్లేదు. ఫలితంగా వైరస్ ఈజీగా వ్యాపిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు ఆస్ట్రేలియా... మెల్‌బోర్న్‌... విక్టోరియాలో ఓ యువకుడు సరికొత్త ప్లాన్ వేసుకున్నాడు. ఇలా గాలి బుడగలో దూరి... రోడ్డుపై అలా వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్లాలన్నా... ఇలాగే వెళ్తున్నాడు. దీని వల్ల అతను ఎంతో స్వేచ్చ లభించినట్లు ఫీలవుతున్నాడు. తనకు ఎట్టి పరిస్థితుల్లో కరోనా సోకదనే కాన్ఫిడెన్స్ అతనిలో ఉంది. ఆ గాలి బుడగ పారదర్శకమైనది కావడంతో... లోపల అతను అందరికీ క్లియర్‌గా కనిపిస్తున్నాడు. దాంతో అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ప్రజలు తమను తాము వైరస్ నుంచి కాపాడుకోవడానికి ఇలా రకరకాల ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఎలాగో బబుల్‌లో ఉన్నాను కదా అని అతను... ముఖానికి ఫేస్ మాస్క్ పెట్టుకోలేదు. అతను ఎవరన్నది గమనించగా... మెల్‌బోర్న్‌కి తూర్పున 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్‌గ్రేవ్ ప్రాంతానికి చెంందిన వాడని తెలిసింది. అతను హై వీధిలో బుడగలో వెళ్తున్న దృశ్యాన్ని ప్రజలు వీడియో తీసుకున్నారు. ఆస్ట్రేలియా ఆల్ ఓవర్ అనే ఫేస్‌బుక్ పేజీలో వీడియోకి సంబంధించిన స్టిల్ ఒకటి అప్‌లోడ్ చేశారు.


ఈ ఫొటో బాగా వైరల్ అయ్యింది. సహజంగా ఈ బుడగలను నీటిలో పిల్లలు ఆడేందుకు ఉపయోగిస్తారు. బుడగల్లో పిల్లల్ని ఉంచి.. నీటిలోకి బుడగను వదులుతారు. అలాంటి ఆ బుడగను ఇప్పుడు కరోనా వైరస్ సోకకుండా వాడుతుంటే... నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆ బుడగకు కన్నం లేదు కాబట్టి అతను లక్కీ అనుకోవచ్చు అని ఓ నెటిజన్ అనగా... గుంపుల్లో నడిచి వెళ్లడం కంటే... ఇది బెటరే అని మరో నెటిజన్ అన్నారు. కొత్తగా ప్రయత్నించడం మంచిదే అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. మెల్‌బోర్న్‌లో అందరూ ఇలా వెళ్లడం మంచిదని మరొకరు తెలిపారు.

ఆస్ట్రోలియాలో తాజాగా 367 పాజిటివ్ కేసులు రాగా... మొత్తం కరోనా కేసులు 15302కి పెరిగాయి. తాజాగా 6గురు చనిపోగా... మొత్తం మరణాలు 167కి చేరాయి. ఇండియాతో పోల్చితే ఇవి చాలా చిన్నలెక్కలే. అక్కడ జనాభా తక్కువ కాబట్టి... కేసులూ తక్కువగానే ఉంటున్నాయి.
Published by: Krishna Kumar N
First published: July 29, 2020, 12:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading