తండ్రి బాటలో ట్విట్టర్‌లోకి రామ్ చరణ్.. బాబాయి బాటలో మొదట ఆ పని చేసిన అబ్బాయి..

టాలీవుడ్ మెగా పవన్ స్టార్ రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బాటలో ట్విట్టర్‌లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు పలువురు సినిమావాళ్లు, అభిమానులు రామ్ చరణ్.. ట్విట్టర్‌లో అడుగుపెట్టడంపై అభినందించారు. మరోవైపు బాబాయి పవన్ కళ్యాణ్ బాటలో..

news18-telugu
Updated: March 26, 2020, 12:26 PM IST
తండ్రి బాటలో ట్విట్టర్‌లోకి రామ్ చరణ్.. బాబాయి బాటలో మొదట ఆ పని చేసిన అబ్బాయి..
పవన్, చిరంజీవి, చరణ్ Photo : Twitter
  • Share this:
టాలీవుడ్ మెగా పవన్ స్టార్ రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బాటలో ట్విట్టర్‌లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు పలువురు సినిమావాళ్లు, అభిమానులు రామ్ చరణ్.. ట్విట్టర్‌లో అడుగుపెట్టడంపై అభినందించారు. మరోవైపు రామ్ చరణ్...ట్విట్టర్‌లో తొలి ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది. తండ్రి బాటలో ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ చిరుత.. బాబాయి పవన్ కళ్యాణ్ బాటలో కరోనా పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా తనవంతుగా రూ.70 లక్షల విరాళం ప్రకటించాడు. రూ. 70 లక్షల్లో ప్రధాన మంత్రి సహాయ నిధితో పాటు  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధి ఎంతెంత కేటాయించాడో మాత్రం వెల్లడించలేదు. మొత్తానికి తన ట్విట్టర్‌లో మొదటి ట్వీట్‌తోనే సంచలనం రేపాడు మెగా పవర్ స్టార్. మరోవైపు అబ్బాయి రామ్ చరణ్ చేసిన పనిని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నాడు. కరోనా వైరస్ కట్టడికి తన వంతుగా రామ్ చఱణ్ రూ.70 లక్షల సాయం ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేసాడు.

అంతేకాదు కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీదలను ఆధుకునందుకు తమ వంతు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమావాళ్లు ఒక్కొక్కరుగా తమ వంతు ఆర్ధిక సాయం ప్రకటించడం ఆనందించదగ్గ విషయమనే చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్.. ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. 1920 బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్.. కేంద్ర, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ 2 కోట్ల విరాళం ప్రకటించారు. మరోవైపు త్రివిక్రమ్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల విరాళం అనౌన్స్ చేసారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు తన వంతు సాయంగా చెరో రూ.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించాడు. ఇంకోవైపు హీరో నితిన్ కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల చెప్పున విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు