హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Oxygen Tankers: భారత్ కు ఉచితంగా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు.. ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. పూర్తి వివరాలివే..

Oxygen Tankers: భారత్ కు ఉచితంగా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు.. ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. పూర్తి వివరాలివే..

ఆక్సీజన్ ట్యాంకులను యుద్ద విమానంలోకి ఎక్కిస్తున్న దృశ్యం

ఆక్సీజన్ ట్యాంకులను యుద్ద విమానంలోకి ఎక్కిస్తున్న దృశ్యం

Oxygen Tankers: దేశంలో నానాటికీ కరోనా మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆక్సీజన్ కొరత తీర్చడానికి మెగా సంస్థ తనవంతు సహకారం అందించేందుకు కృషి చేస్తోంది. దీంట్లో భాగంగానే భారత్ కు థాయ్‌లాండ్ నుండి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇంకా చదవండి ...

దేశంలో మొదటి కరోనా వేవ్ కంటే సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. మొదటి వేవ్ లో కరోనా కేసులు పెరిగినా.. మరణాల రేటు అంతగా లేదు. ప్రస్తుతం సెకండ్ వేవ్ లో కేసులతో పాటు మరణాల రేటు కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇది ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మరణాల రేటు పెరగడానికి గల కారణాల్లో ఒకటి ఆసుపత్రుల్లో ఆక్సీజన్ కొరత విపరీతంగా ఏర్పడడం. దీంతో ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తుండగా మరి కొన్ని సంస్థలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు తన వంతు సహకారం అందించేందుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) సంస్థ ముందుకు వచ్చింది. భారత్ లో ఆక్సిజన్ అవసరాలకు తగ్గట్టుగా పలు ఏర్పాట్లను చేస్తోంది. సామాజిక సేవలో ముందున్న ఎంఈఐఎల్‌ సంస్థ థాయ్‌లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను దిగుమతి చేసుకుంటోంది. 11 టాంకర్లను థాయ్‌లాండ్ నుండి దిగుమతి చేసుకోనుండగా.. తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకులు రానున్నాయి.

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకోనున్నట్లు తెలిపారు. వీటిని ప్రభుత్వానికి ఉచితంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఇవ్వనుంది. వీటి ద్వారా ఆక్సిజన్ కష్టాలను తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం, భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యంగా మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్ లో 1.40 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.


అంతకు ముందే ఈ మేఘా ఇంజనీరింగ్ సంస్థ హైదరాబాద్ లోని నిమ్స్, అపోలో, సరోజినీదేవి కంటి ఆసుపత్రులుకు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను భారీ స్థాయిలో ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఆక్సిజన్ సిలిండర్లు అవసరం ఉన్నాయని నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్ ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో తెలపడంతో సహాయం చేయడానికి ఎంఈఐఎల్ ముందుకు వచ్చింది. భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తి మేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

First published:

Tags: Oxygen tankers import, Pm modi, Thailand

ఉత్తమ కథలు