MEGA BROTHER NAGABABU SENSATIONAL SATIRES ON MEDIA BY USING CORONAVIRUS IN HIS FACEBOOK PK
నాగబాబు సంచలన వ్యాఖ్యలు.. మీడియాకు కరోనా వైరస్..
నాగబాబు (Twitter/Nagababu)
Nagababu: ప్రపంచాన్ని ప్రస్తుతం గడగడలాడిస్తున్న వ్యాధి కోరనా వైరస్. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి చాలా మంచి చనిపోయారు. ఈ వైరస్‌ను అడ్డు పెట్టుకుని మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేసాడు నాగబాబు.
ప్రపంచాన్ని ప్రస్తుతం గడగడలాడిస్తున్న వ్యాధి కోరనా వైరస్. ఇండియాకు కూడా వచ్చేసింది ఇది. అందుకే అంతా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విచ్చిలవిడి ఆహారపు అలవాట్ల కారణంగా చైనాలో ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ వచ్చింది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి చాలా మంచి చనిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగబాబు కూడా ఈ కరోనా వైరస్ గురించి మాట్లాడాడు. అయితే సెటైరికల్‌గా స్పందించాడు ఈయన. ఈ వైరస్‌ను అడ్డు పెట్టుకుని మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేసాడు నాగబాబు. ఎవర్ని ఉద్దేశించి అన్నాడో తెలియదు కానీ తెలుగు మీడియాపై మాత్రం నాగబాబు మామూలు సెటైర్లు వేయడం లేదు.
నాగబాబు (Twitter/nagababu)
తాజాగా తన సోషల్ మీడియా పేజీలో మీడియాపై సంచలన కామెంట్స్ రాసుకొచ్చాడు మెగా బ్రదర్. జనం కంటే వేగంగా కరోనా వైరస్ మీడియాకు పాకుతోందని.. 90 శాతం మీడియాకు కరోనా వైరస్ సోకిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈయన. అసలైన కరోనా వైరస్ కంట్రోల్లోకి వచ్చింది కానీ మీడియాకు పట్టిన వైరస్ మాత్రం నయమయ్యే అవకాశాలు కనిపించడం లేదని కాంట్రవర్సీ కామెంట్స్ చేసాడు ఈయన. ఈ పోస్ట్ ఇప్పటికే వైరల్ అయిపోయింది. అందరు మీడియా హౌజ్‌లపై ఈ సెటైర్ వేసాడా లేదంటే ఎవర్నైనా ఒక్కర్నే టార్గెట్ చేసాడా అనేది ఆసక్తికరంగా మారింది.
గతంలో కూడా మీడియాను బాగానే టార్గెట్ చేసాడు ఈయన. ఎప్పటికప్పుడు తనకు పడని మీడియా హౌజ్‌లపై సంచలన కామెంట్స్ చేస్తూనే ఉంటాడు మెగా సోదరుడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. తనపై వస్తున్న వార్తల్ని ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు చేసాడా లేదంటే జనసేన గురించి తప్పుగా రాస్తున్న వాళ్లకు కౌంటర్ వేసాడా అనేది అర్థం కావట్లేదు. ఏదేమైనా కూడా మీడియాకు కరోనా వైరస్ సోకిందని కామెంట్ చేయడం మాత్రం కొందరికి ఏ మాత్రం నచ్చడం లేదు. అనవసరంగా ఇలా మాటలు జారితే మర్యాద కూడా పోతుంది కదా అని నెటిజన్లు బాహాటంగానే నాగబాబుకు వార్నింగులు కూడా ఇస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.