Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: March 9, 2020, 8:10 PM IST
నాగబాబు (Twitter/nagababu)
జబర్దస్త్ కామెడీ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత అదిరింది షోతో చాలా బిజీ అయిపోయాడు నాగబాబు. ఆ కార్యక్రమాన్ని జబర్దస్త్‌కు పోటీగా ఎలా నిలబెట్టాలా అని తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. ఇదిలా ఉంటే ఈ షోతో పాటు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్‌గా ఉంటున్నాడు నాగబాబు. ముఖ్యంగా ఈయన యూ ట్యూబ్‌లో చేసే కామెంట్స్.. ఫేస్ బుక్‌లో పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. మొన్నటికి మొన్న చిరంజీవి రాజ్యసభ సీట్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు. ఇక ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ట్వీట్ చేసాడు నాగబాబు.

నాగబాబు (Twitter/Nagababu)
కరోనా వైరస్ వచ్చిన దానికంటే కూడా వస్తుందేమో అనే భయంతోనే చాలా మంది చనిపోతున్నారు అంటూ ట్వీట్ చేసాడు నాగబాబు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా రిప్లై ఇస్తున్నారు. ముఖ్యంగా కొందరు అయితే నాగబాబుతో ఆడుకుంటున్నారు.. ఆయన చేసిన పోస్టుపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. కరోనా స్పెల్లింగ్ తప్పుగా రాశారు.. సరి చేయండి సర్ అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత మరొకరు కూడా కాస్త సెటైరికల్‌గానే స్పందించారు. ఏం మాట్లాడుతున్నారు బాబు గారూ అంటూ ఇంకొందరు కామెంట్ చేశారు.

నాగబాబు (Nagababu)
వాళ్లతో పాటు మరికొందరు కూడా కరోనా వైరస్ వస్తుందేమో అనే భయంతో చనిపోతున్నారా.. అయితే ఈ వీడియోలు చూడండి అంటూ కేసీఆర్ మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలను ట్యాగ్ చేస్తున్నారు. కరోనా వచ్చినా కూడా ఎవడూ చచ్చిపోడు.. పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని కేసీఆర్ చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియోను నాగబాబుకు ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు.
Published by:
Praveen Kumar Vadla
First published:
March 9, 2020, 8:10 PM IST