హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనాతో మ‌ృతిచెందిన రోగిపట్ల వైద్య సిబ్బంది అమానుషం.. గోతిలోకి విసిరేసి..

కరోనాతో మ‌ృతిచెందిన రోగిపట్ల వైద్య సిబ్బంది అమానుషం.. గోతిలోకి విసిరేసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వైద్య సిబ్బంది.. అతడి మృతదేహాన్ని పూడ్చేందుకు స్మశానానికి తీసుకెళ్లారు. అంబులెన్సు నుంచి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఆ నలుగురు సిబ్బంది కిందకు దించారు.

  కరోనా వైరస్ సోకడంతో చనిపోయిన రోగి పట్ల సానుభూతిని ప్రదర్శించాల్సింది పోయి.. అమానుషంగా ప్రవర్తించారు ఆ వైద్య సిబ్బంది. మనిషి జీవితంలో చివరి ఘట్టమైన అంత్యక్రియలన్న సంగతి మర్చిపోయి.. ఆ రోగి మృతదేహాన్ని గోతిలోకి విసిరేసి పోయిన దారుణమిది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరిలో ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకడంతో చనిపోయారు. అయితే పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వైద్య సిబ్బంది.. అతడి మృతదేహాన్ని పూడ్చేందుకు స్మశానానికి తీసుకెళ్లారు. అంబులెన్సు నుంచి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఆ నలుగురు సిబ్బంది కిందకు దించారు. అప్పటికే అక్కడ తీసి ఉన్న ఓ గోతిలోకి హడావిడిగా ఆ మృతదేహాన్ని విసిరేశారు. ఆ నలుగురు సిబ్బందిలో ఒకరు మృతదేహాన్ని విసిరేశామంటూ అక్కడున్న అధికారికి చెప్పగా, ఓకేనంటూ సూచికగా వేలు చూపించాడు.

  ఇదిలావుంటే.. చనిపోయిన వ్యక్తిని నిబంధనల ప్రకారం సంచిలో ఉంచాల్సి ఉంది. కానీ ఆ నిబంధనలను వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. దీనికితోడు శవాన్ని పూడ్చే సమయంలో మృతదేహంపై తెల్లని వస్త్రాన్ని సరిగా కప్పలేదు. దీనివల్ల ఆ వైద్య సిబ్బందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అసలు మృతదేహాన్ని సరిగా పూడ్చారా? లేదా? అన్న విషయంపైనా స్పష్టత లేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో అధికారులు సదరు సిబ్బంది తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

  Published by:Anil
  First published:

  Tags: Coronavirus, Covid-19, Puducherry

  ఉత్తమ కథలు