Home /News /coronavirus-latest-news /

MEDICAL ENTRANCE EXAM NEET POSTPONED DUE TO CORONAVIRUS LOCKDOWN IN COUNTRY SK

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. నీట్, జేఈఈ (మెయిన్స్) పరీక్షలు వాయిదా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ పరీక్షకు మొత్తం 15,93,452 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మే 3న ఈ పరీక్ష జరగాల్సి ఉంది.

    కరోనా ప్రభావంతో ఇప్పటికే విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆయా రాష్ట్రాల బోర్డుల పరిధిలోని పదో తరగతి పరీక్షలతో పాటు CBSE, ICSE పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. తాజాగా లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా కూడా పడింది. ఈ మేరకు కేంద్రం మానవవనరుల మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. నీట్ పరీక్షకు మొత్తం 15,93,452 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మే 3న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. ఈ నెల 27న అడ్మిట్‌ కార్డులు విడుదల కావాల్సి ఉంది. ఐతే దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నీట్‌ను వాయిదావేసింది కేంద్రం. పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారన్నది.. దేశంలో కరోనా పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ 15 తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అటు జేఈఈ (మెయిన్స్) పరీక్షను కూడా వాయిదా వేశారు. ఈ రెండు పరీక్షలను మే చివరి వారంలో నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Jee, NEET 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు