HOME »NEWS »Corona vilayatandavam »masks no obstacle for japan new facial recognition it identifies people wearing masks su gh

Face Masks: మాస్కులున్నా గుర్తుపట్టచ్చు.. ఇక మాస్కులు తీసే అవసరం లేదు

Face Masks: మాస్కులున్నా గుర్తుపట్టచ్చు.. ఇక మాస్కులు తీసే అవసరం లేదు
ప్రతీకాత్మక చిత్రం

న్యూ నార్మల్ లైఫ్ (new normal life) లో కొత్త టెక్నాలజీ పరుగులు పెడుతోంది. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నాలకు ఇది మరింత తోడ్పడుతోంది.

  • Share this:
కోవిడ్-19 (Covid-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాస్కు లేకుండా బయటికి వచ్చే పరిస్థితే లేదు. కరోనా మహమ్మారి కారణంగా ముఖంపై మాస్కు వేసుకుని బయటకు రావాల్సి ఉండగా, ఒకరిని ఒకరు గుర్తించటం, పోల్చుకోవటం కూడా కష్టంగా మారుతోంది. దీంతో మాస్కులపై పరిశోధనలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్పరెంట్ మాస్కులు వంటివి ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో రకాల మాస్కుల తయారీలో జపాన్ ముందంజ వేస్తోంది. దీనికి కారణం జపాన్ (Japan) లో ఏడాదిపొడవునా మాస్కులు ధరించటం ఎప్పటినుంచో ఉన్న ప్రాక్టీస్ కావటమే. కరోనా వచ్చాక మనమంతా మాస్కులు ధరిస్తుండగా, జపాన్ లో మాత్రం ఇది సర్వసాధారణం. ఇప్పుడు తాజాగా జపాన్ చేసిన ఓ ఇన్నోవేషన్ ప్రైవసీకి భంగం కలిగించేలా ఉందనే వాదనకు దారితీస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంను (facial recognition system) అభివృద్ధి చేసిన జపనీస్ కంపెనీ ఇప్పుడు విమర్శలపాలవుతోంది.

ఇలా పనిచేస్తుంది..


మాస్కు పెట్టుకున్న ముఖాన్ని గుర్తించేందుకుగాను ముఖంపై కనిపిస్తున్న భాగాలను సాఫ్ట్ వేర్ క్షణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ వ్యక్తి ముఖం ఆకారాన్ని, కళ్లు, చీక్ బోన్స్ ను పరిశీలనగా చూసి ఫేషియల్ రికగ్నేషన్ చేస్తుందన్నమాట. ఇక సాఫ్ట్ వేర్ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సదరు వ్యక్తి తన ఫొటోను ముందే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సిస్టంకు అయ్యే ఖర్చు మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఇప్పటికే లుఫ్తాన్సా (Lufthansa) , స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఈ విధానాన్నిసొంతం చేసుకునేందుకు రెడీ అయ్యాయి. దీంతో ఎన్ఈసీ కార్ప్ సంస్థకు కొత్త కస్టమర్లు భారీగా వచ్చి చేరుతున్నారు. తాము రూపొందించిన ఈ విధానం 99.9శాతం అక్యురసీతో పనిచేస్తుందని కంపెనీ వివరిస్తోంది. మొత్తానికి భవిష్యత్తులో మనం మన ఫేస్ మాస్క్ తీయాల్సిన అవసరం రాకుండా ఉండేలా టెక్నాలజీ అందుబాటులోకి రానుందన్నమాట.

ప్రైవసీకి భంగం
మాస్కు వేసుకున్నా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ఇట్టే వారిని గుర్తుపడుతుంది. మహమ్మారి శరవేగంగా పాకుతున్న ప్రస్తుత సమయంలో ఈ సాఫ్ట్ వేర్ ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. కాంటాక్ట్ లెస్ బిహేవియర్ తో మరింత సురక్షితంగా నావిగేట్ చేయచ్చని ఈ సాఫ్ట్ వేర్ తయారు చేసిన NEC Corp చెబుతోంది. అంతేకాదు అలర్జీలు వంటివి ఉన్నవారికి ఈ టెక్నాలజీ మంచిదని సంస్థ వివరిస్తోంది. ఉదాహరణకు విమానశ్రయ ప్రయాణంలో చెక్ ఇన్, చెక్ అవుట్ లో తమ గుర్తింపు చూపాలంటే ముఖానికి ఉన్న మాస్కు తీయాల్సిందే, ఇలా తీసే క్రమంలో కరోనా సోకితే పరిస్థితి ఏంటి. ఇలాంటి ప్రమాదాలు అరికట్టేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం సమర్థంగా పనిచేస్తుందని కంపెనీ వాదిస్తుండగా ఇది వ్యక్తుల ప్రైవసీకి భంగం వాటిల్లచేస్తుందనే వాదన జోరందుకుంది.
Published by:Sumanth Kanukula
First published:January 08, 2021, 09:27 IST