కేంద్రం షాకింగ్ నిర్ణయం... ఇక మాస్కులు, శానిటైజర్ల ధరలకు రెక్కలే....

ఓవైపు దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుంటే... కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రజలకు ఇబ్బందికర అంశమే.

news18-telugu
Updated: July 7, 2020, 12:16 PM IST
కేంద్రం షాకింగ్ నిర్ణయం... ఇక మాస్కులు, శానిటైజర్ల ధరలకు రెక్కలే....
కేంద్రం షాకింగ్ నిర్ణయం... ఇక మాస్కులు, శానిటైజర్ల ధరలకు రెక్కలే....
  • Share this:
ఇప్పటివరకూ... మాస్కులు, శానిటైజర్లూ... అత్యవసర సరుకుల జాబితాలో ఉన్నాయి. తాజాగా కేంద్రం ఆ జాబితా నుంచి వాటిని తొలగించింది. అంటే... ఇక వాటి ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటివరకూ అవి అత్యవసర సరుకుల జాబితాలో ఉన్నాయి కాబట్టి... వాటి ధరలను ఎడా పెడా పెంచేయడానికి వీల్లేకుండా కంట్రోల్ ఉంది. ఇప్పుడు తయారీ కంపెనీలు దీన్ని ఛాన్స్‌గా తీసుకునే ప్రమాదం ఉంటుంది. అత్యవసరాలు కాదు కాబట్టి... తమకు సెట్టైన ధర విధిస్తామని కంపెనీలు... ధరలను పెంచే అవకాశం ఉన్నట్లే. ఐతే... ఓవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతూ... మాస్కులు, శానిటైజర్ల వాడకం పెరిగిన తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

కరోనా ముందు వరకూ... ఇండియాలో మాస్కులు, శానిటైజర్ల వాడకమే లేదు. డాక్టర్లు మాత్రమే వాటిని ఆపరేషన్ థియేటర్లలో వాడేవాళ్లు. కరోనా రాగానే... ఒక్కసారిగా ప్రజలు మాస్కులు, శానిటైజర్లను పెద్ద సంఖ్యలో కొన్నారు. ఫిబ్రవరి, మార్చిలో... వాటి ఉత్పత్తే సరిగ్గా లేదు. ఆ టైంలో వాటిని చాలా మంది బ్లాక్ మార్కెట్లలో అమ్మారు. కొందరైతే... సందుల్లో తయారుచేసిన శానిటైజర్లకు స్టిక్కర్లు అంటించి... ఎడాపెడా అమ్మారు.

ఇప్పుడు మాస్కులు, శానిటైజర్ల వాడకం తప్పనిసరి. అవి ఇప్పుడు బ్రాండెడ్‌వి మార్కెట్లలో లభిస్తున్నాయి. ఐతే... సామాన్యులు మాత్రం... రూ.10 సర్జికల్ మాస్కులనే కొంటూ వాడుతున్నారు. నిజానికి అవి కరోనాను ఏమాత్రం ఆపలేవు. కానీ పేదరికం కొద్దీ ప్రజలు అలా చేస్తున్నారు. శానిటైజర్లు కూడా ఒక్కోటీ రూ.50 నుంచి రూ.300 దాకా కూడా ఉన్నాయి. ఎంత ఖర్చైనా వాటిని కొనుక్కుంటున్నారు. ఇప్పుడు వాటిని అత్యవసర సరుకుల జాబితా నుంచి తొలగిస్తే... ధరలు పెరిగి... సామాన్యులపై మరింత భారం అవ్వక మానదంటున్నారు నిపుణులు.
Published by: Krishna Kumar N
First published: July 7, 2020, 12:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading